భారత్ లో.. మలేరియా వాక్సిన్ ఉత్పత్తి..!

Chandrasekhar Reddy
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ.హెచ్.ఓ.) మలేరియా వాక్సిన్ ను ఆమోదించింది. దీనిపై ఆ సంస్థ ఒక ప్రకటన కూడా చేసింది. మలేరియా వ్యాధి కూడా ఆయా సీజన్ లో బాగా విజృంభిస్తున్నందున దీనిపై ఏళ్లతరబడి జరిగిన పరిశోధన కృషి ఫలించింది. ఇప్పుడు డబ్ల్యూ.హెచ్.ఓ.  కూడా ఆమోదించడంతో ప్రపంచ ప్రజలకు ఇది అందుబాటులోకి రానుంది. ఈ వ్యాధి వలన ప్రపంచంలో ప్రతి రెండు నిముషాలకు ఒకరు అది కూడా పిల్లలు చనిపోవటం జరుగుతుంది. దానిని అరికట్టడానికి ఇది చక్కగా ఉపకరిస్తుంది అని డబ్ల్యూ.హెచ్.ఓ. తెలిపింది. ఎక్కువగా మలేరియా వ్యాధికి గురి అవుతున్న ప్రాంతాలలో ఈ వాక్సిన్ వాడవచ్చు అని డబ్ల్యూ.హెచ్.ఓ. ఒక సిఫారసు చేసింది. 2025 నాటికి ప్రపంచం నుండి మలేరియా ను నిర్ములించాలని డబ్ల్యూ.హెచ్.ఓ. లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటికే ఈ వాక్సిన్ ను 25 దేశాలలో అందుబాటులోకి తెచ్చారు.
ఒక్క ఆఫ్రికాలోని ప్రతి ఏడాది ఈ వ్యాధితో 260000 మంది పిల్లలు చనిపోతున్నారని డబ్ల్యూ.హెచ్.ఓ. పేర్కొంది. అందుకే అక్కడ ఈ వాక్సిన్ ను విస్తృతంగా వాడాలని సిఫారసు చేసింది. ఇప్పటికే ఈ వ్యాధికోసం వాడుతున్న ఔషదాలతో పాటుగా ఈ వాక్సిన్ వాడితే మృతుల సంఖ్యను ఘననీయంగా తగ్గించవచ్చని డబ్ల్యూ.హెచ్.ఓ. అభిప్రాయపడింది. ఐదు నెలలు పైబడిన పిల్లల నుండి ఈ వాక్సిన్ వాడవచ్చు. దీనిని నాలుగు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 2.3 మిలియన్ డోసులను కేవలం మూడు ఆఫ్రికా దేశాలలో పంపిణి చేసినట్టు డబ్ల్యూ.హెచ్.ఓ. తెలిపింది. ఈ వాక్సిన్ పూర్తిగా సురక్షితం అని డబ్ల్యూ.హెచ్.ఓ. తెలిపింది. ఈ వ్యాధి ప్రముఖంగా దోమకాటు వలన వస్తుంది.
తాజాగా ఈ వాక్సిన్ ను భారత్ లో కూడా తయారీకి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఒప్పందం ఏడాది మొదటిలోనే జరిగినప్పటికీ ఇప్పుడు దానిని బహిర్గతం చేశారు. డబ్ల్యూ.హెచ్.ఓ. ఆమోదించిన వాక్సిన్ ను భారత్ బయోటెక్ లో ఉత్పత్తి చేయనున్నారు. అయితే ఇది ప్రజలకు అందుబాటులోకి తేవడానికి  మరో రెండు ఏళ్ళు పట్టవచ్చు అంటుంది సంస్థ. కరోనా వాక్సిన్ తరహాలోనే ఆయా సంస్థల సానుకూల ఒప్పందాలతో ఈ ఉత్పత్తి సాధ్యం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: