కోవిడ్ అలెర్ట్ : బూస్టర్ డోస్ ఇప్పుడే వద్దు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్-19 వైరస్ కు సంబంధించి బూస్టర్ డోస్ వేసుకున్న నేపథ్యంలో ... ప్రస్తుతం బూస్టర్ డోస్ అవసరం లేదని భారత్ లోని ఆరోగ్య శాఖ పేర్కోంటోంది. భారత దేశంలోని పరిస్థితులకు ఇప్పుడిప్పుడే మరో టీకా అవసం లేదని ఐసిఎంఆర్ తెల్చి చెప్పింది. ఈ విషయమై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గువ స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత దేశ ప్రజలలో నెెలకొంటున్న అపోహలను తొలగించే యత్నం చేశారు. కోరోనా టీకా మందు తీసుకున్న వారిలో సంవత్సరానికి పైగా రోగనిరోధక శక్తి ఉంటుందని చెప్పారు. భారతదేశ పరిస్థితులను, ఇతర దేశాల పరిస్థితులతో పోల్చి చూడరాదన్నారు. కోవిడ్ -19 మూడో దశ ఉద్దృతంగా ఉండబోతున్నదని వస్తున్న వార్తల నేపధ్యంలో బలరాం భార్గవ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవిడ్-19 టీకా వల్ల పెంపొందే యాంటీ బాడీలు ఒక్కోక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయని ఐసి ఎం ఆర్ ఇదివరకే చెప్పిందన్నారు. వివిధ దేశాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులు, వారి ఆహారపు అలవాట్లు, జీవన శైలి ని బట్టి వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని బలరాం వివరించారు. భార త దేశంలోని వయోజనులందరికీ ఇంత వరకూ నూరు శాతం టీకా ఇవ్వలేదని, అదే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. టీకా వేసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎలా ఉందనే విషయమై ఐసిఎం ఆర్ ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తున్నదని ఆయన తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ఆసుపత్రులు యాంటీబాడీల పై పరిశోధనలు చేయాగా పలు అంశాలు తెలిశాయన్నారు. సూది మందు తీసుకున్న వారిలో 95 శాతం మందికి ఏడాది పాటు రోగనిరోధశక్తి ఉన్నట్లు తెలిందన్నారు. అందవల్ల ఇప్పుడిప్పుడే బూస్టర్ డోసు వేసుకోవాల్సిన అవసరం భారత్ లోని వారికి లేదని బలరాం భార్గవ తెలిపారు.
భారత దేశ మార్కెట్ లోకి జైకోవ్ - డి టీకా త్వరలో రానుందని వెల్లడించారు. ఇది సూది మందు అవసం లేని టీకా అని చెప్పారు. ఇప్పటి వరకూ మార్కెట్ లో ఉన్న టీకాలకు, జైకోవ్-డి కి మధ్య ధరలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ మందు తయారు చేసే కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.