ఇలా చేస్తే పంటి సమస్యలు రానే రావు..

Purushottham Vinay
ఇక ప్రతీ రోజూ కూడా బ్రష్ చేసుకునేప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి.కొంతమంది చాలా రఫ్‌గా బ్రష్ చేస్తుంటారు.అలా బాగా బలవంతంగా చేసే బ్రషింగ్‌తో పంటిపైన ఉన్న సున్నితమైన ఎనామిల్ పొర దెబ్బ తింటుంది. దీంతో మీకు సెన్సిటివిటీ సమస్య వస్తుంది. కాబట్టి మరీ రఫ్ గా ఇంకా హార్డ్ గా బ్రష్ చేయకండి. ఇక మరి కొంతమంది అయితే చాలా సేపు బ్రష్ చేస్తుంటారు. అలా అతిగా బ్రష్ చేయడం కూడా ప్రమాదమే అంటున్నారు పళ్ళ డాక్టర్లు. ఇంకొంతమంది ఏకంగా కొన్ని సెకెన్లపాటు చేసి..తక్కువ సమయానికే ఫినిష్ చేస్తారు. ఇలా కూడా అసలు చేయకండి. కనీసం 1-2 నిమిషాలపాటు చక్కగా బ్రష్ చేసుకోవాలని అంటున్నారు పళ్ళ డాక్టర్లు.ఇక మీ పళ్ళు ఎంత ముఖ్యమైనవో చిగుళ్లు కూడా అంతే ముఖ్యం. ఎక్కువగా మీ చిగుళ్లు చీల్చుకుని రక్తం కారుతుంటే.. మీరు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.ఇక కరకరలాడే పదార్థాలు తినేటప్పుడు మీ చిగుళ్లు గాయాలు కాకుండా జాగ్రత్తగా నమలడం అలవాటు చేసుకోండి.

ఇక ఇన్ఫ్లమేషన్ కారణంగా కూడా చిగుళ్లు పాడయి పోతాయి. అందుకే బ్రష్ చేసిన తరువాత .. మీ చిగుళ్లపై సాఫ్ట్ గా రబ్బరుతో చిన్నగా మసాజ్ చేయండి. ఇక అంతేకాదు ఏమైన తిన్న తరువాత ముక్కల్లాంటివి మీ చిగుళ్లపై పేరుకోకుండా జాగ్రత్తపడటం చాలా మంచిది.ఇలా చిన్న పరమాణువులు దంతాలు ఇంకా చిగుళ్లపై పేరుకుంటే ఇన్ఫెక్షన్లు ఇంకా ఇన్ఫ్లమేషన్లు వచ్చే ప్రమాదం చాలా వుంది.కాబట్టి తిన్న తరువాత నీటితో పుక్కలించండి.అప్పుడు పంటిలో చిక్కుకున్న ఆహారం వెంటనే బయటికి వచ్చేస్తుంది.ఇక మనం మన దంతాలను కేవలం ఆహారం నమిలేందుకు మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా కొంతమంది పళ్లను ఓపనర్‌గా ఇంకా అలాగే ప్యాకేజింగ్ టేపు తీసేందుకు అలాగే బట్టలు కుట్టేప్పుడు దారం తెంచేందుకు ఉపయోగిస్తుంటారు. మీ పళ్ళు చాలా బలంగా ఉన్నాయని పదేపదే ఇలాంటి పనులు చేస్తే మీ పళ్లు వదులు అయి తొందరగా పాడైపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: