నీరసంగా అనిపిస్తోందా ? ఈ చిట్కాలను పాటించండి

Vimalatha
తరాలు మారుతున్న కొద్దీ శక్తి కూడా తగ్గిపోతుంది. ఇటీవల కాలంలో స్టామినా బాగా తగ్గిపోతోంది ప్రజల్లో ఊరికే నివాస పడిపోతున్నారు. ఏదైనా ఒక పనిని ఎక్కువ సేపు చేయాల్సి వచ్చిందంటే అష్టకష్టాలూ పడుతున్నారు. దానికి కారణం మారుతున్న జీవవ శైలి, ఆహారపు అలవాట్లు. ఎక్కువ స్టామినా ఉంటే ఏ పనిని అయినా మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు. శరీరంలో స్టామినా లేకపోతే తరచుగా అలసట అనిపిస్తుంది. సాధారణ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వంటి మార్గాల ద్వారా స్టామినాను పెంచుకోవచ్చు. స్టామినాను పెంచుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు బాగా పని చేస్తాయి. అవేంటో చూద్దాము.
క్రమం తప్పకుండా వ్యాయామం
స్టామినా పెంచడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. వ్యాయామం వల్ల స్టామినా బాగా పెరుగుతుంది.
సమతుల్య ఆహారం
తినే ఆహరం శరీర సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహారం తినండి. శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లను ఆహారంలో తగినంత చేర్చండి. ఫాస్ట్ ఫుడ్, చక్కెర పానీయాలపై ఆధారపడటం మానుకోండి.
తగినంత నీరు
తక్కువ నీరు తాగితే డిహైడ్రేషన్ కు గురవుతారు. అందుకే అలసట ఎక్కువ అవుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండటం శరీరానికి మేలు చేస్తుంది. నీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీరు, నిమ్మరసం మొదలైనవి కూడా తీసుకోవచ్చు. వాటిలో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి.
యోగా, ధ్యానం
శక్తి స్థాయిలు తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఒత్తిడి. ఒత్తిడితో కూడిన జీవనశైలి స్టామినాను తగ్గిస్తుంది. ఇది మరింత సులభంగా అలసిపోయేలా చేస్తుంది. యోగా, ధ్యానం శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి.
ఈ స్టామినా పెంచే ఆహరం
అరటిపండు తినడానికి ఆరోగ్యకరమైన చిరు తిండి. దీని పోషకాలు శక్తి స్థాయిలను పెంచుతాయి. మీ శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వ్యాయామం చేసే ముందు అరటిపండు తినండి.
పిండి పదార్థాలకు బదులుగా బ్రౌన్ రైస్‌కి మారండి. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తక్కువ ప్రాసెస్ చేయబడుతుంది. ఇది మీ శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది మీ కడుపుని నిండుగా ఉంచుతుంది.
కాఫీ స్టామినాను కూడా పెంచుతుంది. కెఫిన్ ఆడ్రినలిన్‌ను విడుదల చేస్తుంది. కండరాలకు వేగంగా రక్తాన్ని పంపడంలో సహాయ పడుతుంది. ఇది వేగంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్ కాఫీ తాగితే మంచిది. కేలరీలు తక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: