పొడిదగ్గు అస్సలు తగ్గట్లేదా? ఈ చిట్కాతో మాయం..

Purushottham Vinay
మాములుగా ఎక్కువ మంది కూడా సీజనల్ వ్యాధుల బారినపడతారు.అందులోను ముఖ్యంగా దగ్గు, జలుబు ఇంకా జ్వరాల బారిన పడతారు. అయితే ఇప్పుడు ఓ వైపు కరోనా మహమ్మారి అలాగే మరోవైపు సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి.దీంతో చిన్న పాటి దగ్గు కూడా వచ్చినా భయపడే పరిస్థితులు చాలానే ఉన్నాయి.ఇక చల్లని వాతావరణం కొంతమందికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. ముఖ్యంగా దగ్గు అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఇలా దగ్గురావడానికి ఒక్క సీజన్ మాత్రమే కారణం కాదు.చాలా మందికి కూడా సీజన్ తో సంబంధం లేకుండా పొడి దగ్గు అనేది వస్తుంది. ఎంత ట్రై చేసిన కాని తగ్గినట్లే తగ్గి మళ్ళీ వేధిస్తుంది. ఇక ఈ పొడి దగ్గు తగ్గాలంటే ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి. వెంటనే తగ్గిపోతుంది.
ఇక సర్వసాధారణంగా దగ్గు ఎక్కువగా రాత్రి సమయంలో బాగా వస్తుంది. కాబట్టి దగ్గు నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే తలని కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకుని రాత్రి పడుకొని నిద్రపోతే దగ్గు వెంటనే తగ్గి మీకు చాలా హాయిగా ఇంకా ప్రశాంతంగా అనేది నిద్రపడుతుంది.
గోరు వెచ్చని పసుపు పాలు ప్రతి రోజు రెండు సార్లు తాగితే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
దగ్గు తీవ్రంగా ఆగకుండా వస్తే తిప్ప తీగ అనేది మంచి ఔషధం. ఇక 2 చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలుపుకొని దగ్గు తగ్గేవరకూ ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే ఎంత తీవ్రమైన దగ్గు అయినా ఊరికే తగ్గుతుంది.
దగ్గు కోసం మరొక చక్కటి ఆయుర్వేద చిట్కా తేనె , యష్టిమధురం ,దాల్చినచెక్క.. వీటిని పొడిగా చేసుకోని ఆ పొడిని సమపాళ్లలో తీసుకొని నీటిలో కలుపుకుని రోజుకి రెండు సార్లు పొద్దున ఇంకా సాయంత్రం తీసుకుంటే మంచి దగ్గు తగ్గి ఫలితం ఉంటుంది.
ఆగకుండా దగ్గు వస్తుంటే.. మిరియాల కషాయం అనేది మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అర స్పూన్ నల్ల మిరియాల పొడి తీసుకొని అందులో ఆవు నెయ్యి కలుపుని ఈ మిశ్రమాన్ని ఏదైనా తిన్న తర్వాత తీసుకోవాలి.
ఇక పిల్లలు కనుక దగ్గుతో బాగా ఇబ్బంది పడుతుంటే దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడిని కలిపి ఇస్తే దగ్గు తగ్గి మంచి ఫలితం ఉపశమనం ఇస్తుంది.
అలాగే వేడి వేడి మసాలా టీ కూడా దగ్గుని సహజంగా తగ్గిస్తుంది. అర చెంచా అల్లం పొడి ఇంకా చిటికెడు దాల్చిన చెక్క పొడి అలాగే కొన్ని లవంగాలు తీసుకొని వాటిని టీకి జత చేసి వేడిగా టీ తాగితే దగ్గు వెంటనే తగ్గుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: