గ‌ర్భ‌ధార‌ణ‌పై పొగ ప్ర‌భావం ఉటుందా?

Dabbeda Mohan Babu
సిగ‌రేటు అల‌వాటు ఉన్న వారి ఆరోగ్యానికి ప్ర‌మాదం ఉంటుంది. అలాగే సిగ‌రేటు పోగ పీల్చుకున్న వారిలో నూ అరోగ్య‌ప‌ర‌మైన స‌మస్య‌లు ఉంటాయి. వీటిపై ఇప్ప‌టి కే చాలా మంది శాస్త్ర వేత్త‌లు ప‌రిశోద‌న‌లు చేసి చెప్పారు. కానీ భ‌ర్త బ‌య‌ట సిగ‌రేటు తాగి వ‌చ్చినా భార్య కు అరోగ్య ప‌రమైనా స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. భ‌ర్త తాగే సిగ‌రేట్ల సంఖ్యం పెరుగుతున్న కొద్ది వారి ఆరోగ్యం పై స‌మ‌స్య‌లు పెరుగుతూనే ఉంటాయి. అది భార్య గ‌ర్భ ధార‌ణ పై తీవ్ర ప్ర‌భావం ఉంటుంది.

భ‌ర్త సిగ‌రేట్లు తాగ‌డం వ‌ల్ల భార్య గ‌ర్భ ధార‌ణ పై  ప్ర‌భావం చూపుతుంది. ఆమె  గ‌ర్భ ధార‌ణ‌కు ఆల‌స్యం అయ్యే ప్ర‌మాదం ఉంది. అత‌డి స్మోకింగ్ ద్వారా భార్య‌లో ని హార్మోన్ ల‌లో ఉండే జీవ ర‌సాయ‌నాల్లో మార్పు రావ‌చ్చు. దీంతో భార్య లోని అండాల సంఖ్య తగ్గిపొవ‌చ్చు. ఒక వ్య‌క్తి లో ఒక సారి అండాల సంఖ్య త‌గ్గితే వాటిని మ‌ళ్లి తిరిగి  పొంద‌డం అనేది అసాధ్యం. సాధార‌ణ దంప‌తుల కంటే స్మోకింగ్ వంటి అల‌వాట్లు ఉన్నావారి భార్య‌ల‌లో ప్రేగ్నెన్సీ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అంతే కాకుండా గ‌ర్భం ఉన్న వారికి కూడా గ‌ర్భ స్రావం జ‌రిగే ప్ర‌మాదమూ ఉంది. వీటితో పాటు గ‌ర్భం దాల్చినా.. పుట్ట బోయే పిల్ల‌లు నెల‌లు  నిండ క ముందే పుడుతారు. ఇలాంటి పిల్ల‌లు చాలా త‌క్కువ బ‌రువు తో ఉంటారు. అంతే కాకుండా భ‌విష్య‌త్తులో గండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, స్థూల కాయం వంటి జ‌బ్బు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

పోగ తాగే అల‌వాటు ఉన్న పురుషుల‌కు కూడా  చాలా ప్ర‌మాదాలే ఉన్నాయి. వీరికి ముఖ్యంగా క్యాన్స‌ర్ వచ్చే అవ‌కాశలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో పాటు వారికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు కూడా త‌గ్గిపోతాయి. వీరిలో ముఖ్యంగా వీర్యంలో శుక్ర కణాల సంఖ్య గ‌ణ‌నీయంగా ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. అలాగే శుక్ర క‌ణాల క‌ద‌లికలు, చురుకు ద‌నం కోల్పోవ‌డం జ‌రుగుతుంది. అలాగే శుక్ర క‌ణాల ఆరోగ్యం కూడా త‌గ్గి పోతుంది. ఇలాంటి దుష్ప్రాభావాల‌కు లోను కాకుండా సిగ‌రేట్లు కు దూరం ఉండ‌ట‌మే ఉత్త‌మం.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: