గాలి ద్వారా క‌రోనా కొత్త వేరియంట్లు వ్యాప్తి.!

Paloji Vinay
క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచం పై ఎంత‌లా విరుచుకు ప‌డిందో  అంద‌రికీ తెలిసిందే. ఎన్నో విషాద ఛాయ‌లు ఎన్నో బంధాలు, అంత‌కు మించి దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూల‌డానికి క‌ళ్ల‌కు క‌నిపించ‌ని వైర‌స్ క‌రోనా కార‌ణమే.. మొద‌ట్లో కరోనా మ‌హ‌మ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుంద‌ని ఆ త‌రువాత వ్యాపించ‌ద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. కేవ‌లం క‌రోనా వైర‌స్ బాధితుడి నోటి నుంచి వ‌చ్చిన తుంపిర్ల ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తుంద‌ని చెప్పారు. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన వ్య‌క్తి తుమ్మ‌డం లేదా ద‌గ్గ‌డం వ‌ల్ల 6 మీట‌ర్ల వ‌ర‌కు క‌రోనా వైర‌స్ ప్ర‌యాణిస్తుంద‌ని ఇందు కార‌ణంగా వ్య‌క్తుల మ‌ధ్య క‌నీసం 6 మీట‌ర్ల దూరం ఉండాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని వైద్య నిపుణుల వెల్ల‌డించారు.

   అయితే, ఇప్పుడు క్ర‌మంగా క‌రోనా వైర‌స్ ప‌లు ర‌కాలుగా రూపాంత‌రం చెందుతూ వ‌స్తోంది. కరోనాలో కొత్తగా వస్తున్న రకాలు గాలి ద్వారా సంక్రమించేలా క్రమంగా రూపాంతరం చెందుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు త‌మ ప‌రిశోధ‌న‌ల ఆధారంగా పేర్కొంటున్నారు. ఈ వైరస్‌లోని ఆల్ఫా వేరియంట్ భారిన పడిన వారు.. సాధారణ రకంతో పోలిస్తే 43 నుంచి 100 రెట్లు ఎక్కువగా వైరల్‌ రేణువులను గాల్లోకి వెదజల్లుతారని గుర్తించారు శాస్త్ర‌వేత్త‌లు. ఈ నేపథ్యంలో ముఖానికి సరిగా అమరని క్లాత్‌, సర్జికల్‌ మాస్కుల వల్ల కొవిడ్‌-19 వ్యాప్తి సగం మేర మాత్రమే తగ్గుతుందని చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో ప‌లు విష‌యాలు తెలుసుకున్నారు.

 అల్ఫా రకం ర‌కంతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలో పాల్గొన్న డాన్‌ మిల్టన్ వెల్ల‌డించారు.  కొత్త వేరియంట్లు క్రమంగా గాలి ద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయ‌ని, అందువల్ల గదుల్లో వెంటిలేషన్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు ఆయ‌న‌.  ముఖానికి సరిగా అమరే మాస్కుల‌ను పెట్టుకోవాల‌ని దీనికితోడు వ్యాక్సిన్ తీసుకుంటే వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని డాన్ మిల్ట‌న్ చెప్పారు.

కొత్త వేరియంట్ల వల్ల బాధితుల శరీరంలో వైరల్‌ లోడు ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఈ లోడును మించి.. గాల్లోకి సులువుగా వ్యాపించే సామర్థ్యం కూడా వాటివల్ల పెరుగుతోందని తమ పరిశోధనలో తెలిసింద‌ని కరోనాలో కొత్తగా వస్తున్న రకాలు గాలి ద్వారా సంక్రమించేలా క్రమంగా రూపాంతరం చెందుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్‌లోని ఆల్ఫా వేరియంట్‌ బారినపడిన వ్యక్తులు.. సాధారణ రకంతో పోలిస్తే 43 నుంచి 100 రెట్లు ఎక్కువగా వైరల్‌ రేణువులను గాల్లోకి వెదజల్లుతారని గుర్తించారు.


 ఈ నేపథ్యంలో ముఖానికి సరిగా అమరని వస్త్ర, సర్జికల్‌ మాస్కుల వల్ల కొవిడ్‌-19 వ్యాప్తి సగం మేర మాత్రమే తగ్గుతుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఆల్ఫా రకం కన్నా డెల్టా వేరియంట్‌ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలో పాల్గొన్న డాన్‌ మిల్టన్‌ పేర్కొన్నారు.


కొత్త వేరియంట్లు క్రమంగా గాలిద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయి. అందువల్ల గదుల్లో వెంటిలేషన్‌ బాగుండాలి. ముఖానికి సరిగా అమరే మాస్కులు ధరించాలి. దీనికితోడు టీకాలను పొందితే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. కొత్త వేరియంట్ల వల్ల బాధితుల శరీరంలో వైరల్‌ లోడు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఈ లోడును మించి.. గాల్లోకి సులువుగా వ్యాపించే సామర్థ్యం కూడా వాటివల్ల పెరుగుతోందని తమ పరిశోధనలో తేలినట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: