ఆ దేశంలో మనుషులు పొట్టి వారైపోతున్నారు.. కారణం..?

MOHAN BABU
 ప్రపంచ చరిత్రలోనే అత్యంత పొడవుగా ఉండే వ్యక్తులుగా మీరు పొందినటువంటి వారు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఇక్కడ అందరూ కనీసం ఆరు అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉండే ఆ దేశ ప్రజలు క్రమంగా ఎత్తు తగ్గుతున్నారు అని సర్వే తెలిపింది.  అయితే కొందరు మా తాత ఆరడుగుల పొడవు  ఉండేవాడు అని.. ఎవరైనా అన్నారంటే హా అంటూ.. మరి ఏంట్రా నువ్వు ఇంతే ఉన్నావని.. అనే మాటలు మనం వింటూనే ఉంటాం. అయితే మన తాతలు కూడా పొడవుగా ఉంటే  మనం కూడా పొడవు గానే ఉంటామని, అది డీఎన్ఏ ద్వారా వంశపారంపర్యంగా వస్తుందని మనకు తెలుసు.. ఏండ్లు గడుస్తున్నా కొలది  ఆ దేశంలో మాత్రం పుట్టిన ప్రతి వారు ఇప్పుడు తగ్గుతూ వస్తున్నారట.. అది నిజమేనని చెబుతోంది ఒక సర్వే..

ఒకప్పుడు  ప్రపంచంలోనే అత్యధిక పొడవు గల వారిలో పేరు సంపాదించిన దేశస్తులు ప్రస్తుత కాలంలో అంత పొడవుగా పెరగడం లేదని, పొట్టిగా  ఉంటున్నారని, పొట్టిగా అంటే మరీ పొట్టిగా  కాదు, గత తరాలతో  పోల్చుకుంటే  పొడవు  తగ్గి పోయారని తెలుస్తోంది. ఆ దేశం ఆరడుగుల ఆజానుబాహులకు పుట్టినిల్లు.. దానిపేరే నెదర్లాండ్.. అక్కడ పురుషులతో పాటుగా మహిళలు  కూడా  దాదాపు ఆరు నుండి ఏడు అడుగుల ఎత్తు ఉండేవారట.

అందుకే ఆ ఆ దేశాన్ని ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తులలో  పేరు సంపాదించింది. గత ఆరు దశాబ్దాల నుంచి  ఈ యొక్క రికార్డు ఆ నెదర్లాండ్  దేశం పైనే ఉంది. అయితే ఈ యొక్క రికార్డు క్రమంగా దూరమై పోతున్నట్టు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఇందులో 1980లో పుట్టిన  వాళ్లతో పోల్చుకుంటే 2001 వ సంవత్సరంలో పుట్టిన వారితో పోలిస్తే అప్పటికీ ఇప్పటికీ ఎత్తులో తేడా వచ్చిందని 2001 వారు పొడవు తక్కువ అయ్యారని  ఒక అధ్యయనంలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: