హైదరాబాదులో స్వచ్ఛమైన గాలి కావాలా.. ఇక్కడికి వెళ్ళండి..?

MOHAN BABU
 ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. మనిషి విలాసవంతమైన  గృహ నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం భూమిపై ఉన్నటువంటి చెట్లను నరికి వేస్తూ తన ఆయు ప్రమాణాన్ని  తగ్గించు కుంటున్నాడు. ఇలా వాతావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాడు. ప్రస్తుతం ఈ కల్చర్ గ్రామాల్లో కూడా  కొనసాగుతోంది. ఇక పట్టణాల పరిస్థితి  చెప్పనక్కర్లేదు. పట్టణాలలో పెరిగి ఎటువంటి రియల్ ఎస్టేట్, ఫ్యాక్టరీలు, వాహనాలు వీటన్నిటి కోసం మనం చెట్లను నరుకుతూ ఉన్నాం. ఈ విధంగా నరికి వాయు కాలుష్యాన్ని కూడా పెంచుతున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో  విపరీతమైన వాయు కాలుష్యం పెరిగిపోయింది.

చాలాచోట్ల  స్వచ్ఛమైన గాలి లెవెల్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో నగర ప్రజలుఅనేక రోగాల బారిన పడుతున్నారు. కానీ నగరంలో కొన్ని ప్రాంతాలలో మాత్రం మనం క్వాలిటీ ఎయిర్ ఆస్వాదించవచ్చు.. అదెక్కడో తెలుసుకుందామా..?
 ప్రస్తుతం హైదరాబాదులకు స్వచ్ఛమైన గాలి కావాలంటే వారితో ఏదైనా మారుమూల గ్రామాలకి వెళితే కాని దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే నగరంలో కలిగినటువంటి వాహనాలు, ఫ్యాక్టరీలలో నుండి వచ్చేటువంటి చెడు వాయువులు గాలిలో చేరడం వలన గాలి ఎంత కాలుష్యమైనదో పోతుంది. దీంతో ఆ గాలిని పీల్చుకుని నగరవాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనికోసమే స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కొన్ని స్థలాలు హైదరాబాదులో ఉన్నాయి. ఒకటి జూబ్లీహిల్స్ ప్రాంతం, రెండవది  ఉప్పల్ ప్రాంతం. ఇటీవల  తెలంగాణ కాలుష్య నియంత్రణ శాఖ స్వచ్ఛమైన గాలి ఇండెక్స్ ను నివేదిక ద్వారా విడుదల చేసింది.. ఈ యొక్క నివేదికలో హైదరాబాద్లోని రెండు ప్రాంతాల్లో మాత్రమే క్వాలిటీ గాలి దొరుకుతుందని తెలియజేసింది. నగరంలో ఏదైనా  నాణ్యత కలిగిన గాలి దొరుకుతుంది అంటే అది జూబ్లీహిల్స్ మాత్రమేనని, దాని తర్వాత ఉప్పల్ ప్రాంతమని తెలిపారు.

అయితే ఈ ప్రాంతాలు ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ  ఇక్కడ నాణ్యమైన స్వచ్ఛత కలిగిన గాలి ఉందని దీని నాణ్యత ప్రమాణం 40 నుంచి 50 మధ్య ఉన్నదని వారు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో దీని నాణ్యత ప్రమాణం చాలా పెరిగిందని వారు గుర్తించారు. దీంతోపాటు ఉప్పల్ లో కూడా నాణ్యత స్థాయి ఎక్కువగా ఉందని తేలిందని వారు తెలిపారు. ఈ ప్రాంతాలతో పాటు  చార్మినార్, బాలానగర్, పేరడైజ్  ఇంకొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి ఉందని నివేదిక తెలియజేసింది. అయితే సాధారణంగా గాలి క్వాలిటీ 1 నుంచి  50 మధ్య ఉంటేనే బాగున్నట్టు అని  వారు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: