హైద‌రాబాద్‌లో స్వ‌చ్ఛ‌మైన గాలి దొరికేది అక్క‌డేన‌ట‌..!

MADDIBOINA AJAY KUMAR
ప్ర‌స్తుతం గాలీ, నీరు అన్నీ క‌లుషిత‌మే. ఇక గ్రామాల్లో ప‌రిస్థితి ప‌ర్వాలేద‌నింపించినా ప‌ట్ట‌ణాల్లో మాత్రం స్వ‌చ్చ‌మైన గాలి, నీరు దొర‌క‌డం క‌రువైపోయింది. దాంతో అన్ని న‌గ‌రాల‌లో నీటిని ఎంతో డ‌బ్బు పెట్టి కొంటుండ‌గా కొన్ని న‌గ‌రాల్లో స్వ‌చ్చ‌మైన గాలి పీల్చేందుకు డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నారు. ఇక హైద‌రాబాద్ లోనూ కాలుష్యం ఎక్కువే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే న‌గ‌రంలో రెండు ప్రాంతాల్లో మాత్రం స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చుకోవ‌చ్చ‌ని పీసీబీ త‌మ నివేధిక‌లో వెల్లడించింది. జూబ్లీహిల్స్, ఉప్పల్ ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలు త‌క్కువ‌గా ఉండి నాణ్యమైన గాలి ఉంద‌ట‌. 

ఈ నెల 7న జూబ్లీహిల్స్, ఉప్పల్ లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత ఉంద‌ట‌. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ) పేర్కొంది. తన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో టీఎస్ పీసీబీ ఈ విషయాన్ని తెలిపింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో నాణ్యమైన గాలి లభించేది జూబ్లీహిల్స్ లోనే అని చెప్పింది. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ ఎయిర్ క్వాలిటీ మాత్రం బాగుందని వెల్ల‌డించ‌డం విశేష‌షం. ఈ నెల 7వ తేదీన‌ జూబ్లీహిల్స్, ఉప్పల్ లో 30 నుండి 50 మధ్య గాలి నాణ్యత నమోదయ్యింది.

ఈ రెండు ప్రాంతాలతో పాటూ ప్యారడైజ్, చార్మినార్,బాలానగర్ ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత బాగుందని పీసీబీ తెలిపింది. జీడిమెట్ల ప్రాంతంలో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆందోళ‌న క‌లిగించే విష‌ష‌యం చెప్పింది. గాలి నాణ్యత విషయానికి వస్తే 0 నుండి 50 వరకు ఉంటే బాగుందని... అదే 51 నుండి 100 మధ్య ఉంటే సంతృప్తికరమని.... 101 నుండి 200 మధ్య ఉన్న‌ట్ల‌యితే ఓ మాదిరి అని.... 201 నుండి 300 మధ్య ఉంటే పూర్ అదే విధంగా 301 నుండి 400 మధ్య ఉంటే వెరీ పూర్ అని... 400 పైన నమోదయిన‌ట్ల‌తే తీవ్ర కాలుష్యంగా భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: