థర్డ్ వేవ్ బెల్స్ .. మోగినట్టేనా ..

Chandrasekhar Reddy
కరోనా మొదటి వేవ్ లో ముసలివారిపై, రెండో వేవ్ లో యువకులపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. దీనివలన ఆయా వయసుల వారు తీవ్రంగా కష్టపడ్డారు. మొదటి వేవ్ ను ధైర్యంగా ఎదుర్కొన్న యావత్ భారత్ దేశం అనంతరం కాస్త నిర్లక్ష్యం వహించింది అనే చెప్పాలి. దీనితో ఆ ప్రభావం రెండో వేవ్ లో చూశాం. ఈ వేవ్ లో చాలా మంది ఆఖరి నిముషంలో ఆసుపత్రులకు క్యూ కడుతుంటే వారికి ఒక స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆక్సిజన్ సరఫరా చేయలేకపోయాయి. దీనివలన చాలా మందిని కళ్ళముందే కోల్పోవాల్సి వచ్చింది. ఈ వేవ్ తో గుణపాఠం నేర్చుకున్న ఆయా ప్రభుత్వాలు థర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని ప్రణాళికలు వేసుకున్నాయి. ఈ ప్రకారంగానే ముందస్తు ఏర్పాట్లు వైద్యశాలలలో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ థర్డ్ వేవ్ లో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండనుందని వైద్య శాఖ స్పష్టం చేసింది. దీనివలన పిల్లలకు ప్రాణాపాయం లేనప్పటికీ వీలైనంత జాగర్తగా ఉండాలని అధికారులు సూచించారు. అయినా రెండో వేవ్ ఇంకా కొనసాగుతున్నదని ఇటీవలే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కాస్త కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు ఆయా పాఠశాలలు తెరిచాయి. దీనితో పిల్లలను ఇంటివద్ద భరించలేని తల్లిదండ్రులు కొందరు పాఠశాల బాట పట్టించారు. దీనివలన ఎంతైనా ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలుపుతున్నారు. కానీ రెండు ఏళ్లగా ఇళ్లలో ఉన్న వారు ఇప్పటికైనా పాఠశాలలకు వెళ్లాలని ఆసక్తి చూపడం కూడా ఆయా  నిర్ణయానికి కారణం.
దీనివలన 2.8 శాతం పిల్లలు కరోనా ప్రభావితం కాగా, ఇది 7.4 శాతానికి పెరిగిందని వైద్యశాఖ హెచ్చరించింది. అంటే దాదాపు వందలో ఏడు కేసులు పిల్లలే ఉంటున్నారు. అదికూడా పదేళ్లలోపు పిల్లలే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఇది థర్డ్ వేవ్ కు డేంజర్ బెల్స్ అని వారు సూచిస్తున్నారు. ఇప్పటికి ఈ సంఖ్య పెద్దది కానప్పటికీ తగిన జాగర్తలు పాటించాలి అని వారు సూచిస్తున్నారు. దాదాపు మొదటి, రెండవ వేవ్ లలో పెద్దలలో ఈ వైరస్ ప్రభావం తగ్గటంతో థర్డ్ వేవ్ లో పిల్లలపై విజృంభిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ముందస్తు జాగర్తలు పాటించడం అనివార్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: