జలుబుతో పాటు ఈ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం తులసి

Vimalatha
తులసి మొక్కను హిందూ మతంలో అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. మరోవైపు ఇది ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణించబడుతుంది. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతోంది. సాధారణంగా ప్రజలు తులసి వాడకాన్ని జలుబు, ఇతర సమస్యలకు మాత్రమే పరిమితం చేస్తారు. కానీ నిజానికి చలి కాలంలో తులసి వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. రోజూ తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళ్తుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. అంతే కాకుండా తులసితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాని గురించి తెలుసుకుందాం.
1. మెదడు శక్తిని పెంచాలనుకుంటే మీరు తప్పనిసరిగా ప్రతి రోజూ తులసి ఆకులను తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే అది మేధస్సుకు పదును పెట్టి మనసుకు బలాన్ని ఇస్తుంది.
2. ఆస్తమా సమస్య ఉంటే తులసి ఆకుల రసం, పొడి అల్లం, ఉల్లిపాయ రసం, తేనె కలిపినా మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది ఆస్తమా సమస్యకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీనితో పాటు పొడి దగ్గులో కూడా ఉపశమనం లభిస్తుంది.
 
3. తులసి ఆకులను నీటిలో మరిగించి క్రమం తప్పకుండా తాగితే, జ్వరం, వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను చాలా వరకు నివారించవచ్చు. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తులసి బాగా పని చేస్తుంది.
 
4. తులసి ఆకులను నీటిలో మరిగించి అందులో పసుపు, రాతి ఉప్పు కలపండి. ఈ నీటిని కొద్ది కొద్దిగా త్రాగండి. దీని కారణంగా దంతాలు, నోరు, గొంతు రుగ్మతలు తొలగిపోతాయి.
 
5. మీకు పంటి నొప్పి సమస్య ఉంటే తులసి ఆకులు, నల్ల మిరియాలు చూర్ణం చేసి, దానిని ఒక టాబ్లెట్ లాగా చేసి మీ దంతాల కింద నొక్కి పెట్టండి. దాని రసాన్ని నెమ్మదిగా తీసుకోండి. దీంతో పంటి నొప్పి మాయమవుతుంది. కానీ తులసిని దంతాలతో నమలకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఆకులలో ఇనుము, పాదరసం ఎక్కువగా ఉంటాయి. ఇది మన దంతాలను దెబ్బతీస్తుంది.
6. దీర్ఘకాలిక తల నొప్పిని తొలగించే సామర్థ్యం తులసికి ఉంది. దీని కోసం ముక్కులో ఒకటి నుండి రెండు చుక్కల తులసి నూనె వేయాలి. అంతే తలనొప్పి మాయమవుతుంది.
7. పిల్లలు, పెద్దలు ఎవరైనా మళ్లీ మళ్లీ జలుబుతో బాధపడుతుంటే, తులసి ఆకుల రసం తీసిన తర్వాత, అల్లం రసాన్ని తీసుకుని రెండింటినీ తేనెతో కలపండి. ఆ తరువాత దీనిని తీసుకోండి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: