ఈ టీతో ఆరోగ్య సమస్యలు మాయం...

Purushottham Vinay
మన భారతీయ వంటకాలలో ఉపయోగించే మసాల దినుసులు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని తెలిసిందే.ఇక అవి కేవలం వంటలలో మాత్రమే కాకుండా డైరెక్టుగా తీసుకున్నా లేదా వివిధ రకాలుగా తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాచీలు, దాల్చిన చెక్క ఇంకా నల్ల మిరియాలతో అనారోగ్య సమస్యలకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అయితే ఈ మసాలా దినుసులతో బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. నల్ల మిరియాలను ఎక్కువగా కారం ఇంకా ఘాటు కోసం వాడుతుంటారు. అలాగే నాన్ వెజ్ వంటకాలలో నల్ల మిరియాలను వాడేది కూడా స్పైసీ కోసమే. అందుకే నల్ల మిరియాలని కింగ్ ఆఫ్ స్పైసీ అంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా నల్ల మిరియాలను ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలకు వాడతారు.నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని  కాపాడతాయి. ఇవి శరీరంలోని మంటను కూడా ఈజీగా తగ్గిస్తాయి.

ఇవి శోథ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.ఇక అంతేకాకుండా ఇవి రక్తంలో చక్కెర స్తాయిని నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి.ఇంకా అలాగే కొలెస్ట్రాల్‏ను కూడా తగ్గిస్తుంది.అలాగే పెయిన్ కిల్లర్‏లాగా కూడా పనిచేస్తాయి.ఇక నల్ల మిరియాలు జీవక్రియను పెంచుతుంది. అలాగే ఇవి కేలరీలను బర్న్ చేయడంలోనూ ఎంతగానో సహాయపడతాయి. ఇక బరువును కూడా వెంటనే తగ్గిస్తాయి.అలాగే ఇందులో పైపెరిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది.ఇక అలాగే నల్ల మిరియాల టీని తాగడం వలన మానసిక స్థితి మెరుగుపడటమే కాకుండా ఒత్తిడి కూడా ఈజీగా తగ్గుతుంది.ఇక నల్ల మిరియాల టీ తాగితే మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.కాబట్టి నల్ల మిరియాల టీ తాగండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.రోజు కూడా మాములు టీకి బదులుగా ఈ నల్ల మిరియాల టీ తాగితే అనేక అనారోగ్య సమస్యలు మాయం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: