బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ ఈజీ చిట్కా పాటించండి

Manasa
బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? వ్యాయామం చేస్తున్నారా?డైటింగులు కూడా చేస్తున్నారా?
వాటితో పాటుగా కొన్ని చిట్కాలు కూడా పాటించండి,ఫలితాలు రెట్టింపు వేగంతో  చూడొచ్చు. పని మీద చిత్తం ఎక్కువవడంతో ఆరోగ్యాన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు. తెలీకుండానే అధిక బరువు పెరిగిపోయి,లేనిపోని రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రజలు ఈ విషయంలో ఈ మధ్య కొంచెం కాన్షియస్ అయిపోయారండోయ్, అందుకే ఎక్కువ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఫిట్నెస్ కి సంబంధించిన పోస్టులు తెగ చేస్తున్నారు.
కొత్తగా 21 డేస్ ఛాలెంజ్, 3  మంత్స్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఆరోగ్యానికి ఓ దారికి తెచ్చుకుంటున్నారు అలాగే వేరేవాళ్లకి రోల్ మోడల్ కూడా అవుతున్నారు.ఈ చిన్న చిట్కా మీ బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. అదేంటంటే...
చిట్కా:నీరు మన ఒంటికి చాలా మంచిది అని తెల్సింది . ఎంత బాగా నీళ్లు తాగితే అంత ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు కూడా చెబుతున్నారు.తాగే నీళ్లలో కొన్ని సబ్జా గింజలు వేసుకోండి. అలా సబ్జా గింజలు నాటిన నీళ్ళని రోజంతా తాగొచ్చు దీన్ని ఆహారంలో కూడా ఆడ్ చేసుకోవచ్చు. (ఉదాహరణ:పెరుగు, వోట్మీల్ లేదా స్మూతీల పై చల్లవచ్చు. రొట్టె లేదా బ్రెడ్ కు జోడించవచ్చు) ఇంత చిన్నవి ఏం చేస్తాయి అని తేలికగా తీసిపారేయకండి, రిజల్ట్స్ చూసి మేరె అవాక్కు అవుతారు.
ఈ చిన్న విత్తనాలే  శక్తివంతమైన పోషక పంచ్‌ను ప్యాక్ చేస్తాయి.ఇవి మనకి మార్కెటు లో చాలా ఈజీగా దొరుకుతాయి. వీటిని   చియా సీడ్స్, బేసిల్ సీడ్స్ అని కూడా అంటారు.
దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు.ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు  సాధారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం ఫైబర్ ఉండే ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
సబ్జా గింజల్లోని లాభాలు: దీనిలో ఒమేగా -త్రీ, మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి .అదే కాకుండా ఇవి  ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం అందిస్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: