కొవిడ్ కొత్త వ్యాక్సిన్.. ఎలా త‌యారు చేస్తారో తెలుసా?

Dabbeda Mohan Babu
మ‌న దేశంతో పాటు ప్ర‌పంచ దేశాలను కరోనా వైర‌స్ వ‌ణింకించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దీని భారీన క‌ట్లాది మంది ప్ర‌జ‌లు ప‌డ్డారు. అలాగే ల‌క్ష‌ల‌లో చ‌నిపోయారు. అయితే ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌లు చాలా రోజుల పాటు ప్ర‌యోగాలు నిర్వ‌హించారు. చివ‌ర‌కి క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప‌లు ర‌కాల వ్యాక్సిన్ ల‌ను త‌యారు చేశారు. వాటి ని ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. కాగ ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్ లు త‌యారు చేయ‌డానికి చాలా శ్ర‌మ తో పాటు అధిక మొత్తం ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. అలాగే క‌రోనా వైర‌స్ త‌న మ్యూంటెట్ల ను మార్చుకొని ఇంకా ప్ర‌మాద‌కంగా మారుతోంది. కొవిడ్ యొక్క ప్ర‌మాద‌క‌ర‌మైన మ్యూటెంట్ల నుంచి, ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ అయ్యే భారీ వ్య‌యాల నుంచి త‌ప్పించు కోవ‌డానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్త‌లు చాలా రోజుల నుంచి అనేక ప్ర‌యోగాలు చేస్తున్నారు.

కాగ అమెరికాలో గ‌ల‌ శాన్ డియాగో లోని కాలిఫోర్నియా విశ్వ‌విద్యాలయం శాస్త్ర‌వేత్త‌ల అనేక ప్ర‌యోగాల అనంత‌రం ఒక కొత్త ర‌క‌మైన వ్యాక్సిన్ ను క‌నుగోన్నారు. ఈ వ్యాక్సిన్ ను మొక్క‌ల నుంచి బ్యాక్టిరీయా నుంచి త‌యారు చేస్తున్నామ‌ని తెలిపారు.  ఈ కొత్త ర‌కం వ్యాక్సిన్ త‌క్కువ శ్ర‌మ‌తోని అలాగే త‌క్కువ వ్య‌యంతో రూపోందుతోంద‌ని శాస్త్ర‌వేత్తలు ప్ర‌క‌టించారు.  


ఈ వ్యాక్సిన్ ల‌ల్లో ఒకదానిని మొక్క‌ల‌ల్లోనే జ‌న్యూ మార్పిడి చేసి రూపొందించామ‌ని తెలిపారు. అలాగే మ‌రొక దానిని బాక్టీరియోఫేజ్ లేదా బ్యాక్టీరియాల్ వైర‌స్ నుంచి త‌యారు చేశామ‌ని తెలిపారు.  ఈ వ్యాక్సిన్ ల‌ను మైన‌స్ డిగ్రి ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద భ‌ద్రప‌ర్చాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఇదే వీటి ప్ర‌త్యేక‌త అని వివ‌రించారు. కాగ ఈ రెండు ర‌కాల వ్యాక్సిన్ ల అభివృద్ధి ప్రారంభ ద‌శ‌లో ఉన్నాయ‌ని వారు తెలిపారు. వీటి పై మ‌రిన్ని ప్ర‌యోగాలు జ‌రిపి మానువుల కోసం ఉప‌యోగిస్తామ‌ని ప్ర‌క‌టించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: