మన గబ్బిలాలతో డేంజర్ తప్పదా..?

MOHAN BABU
కరోనాతో  కొట్టుమిట్టాడుతున్న కేరళ పై మరోసారి నిఫా వైరస్ పంజా విసురుతుంది. గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ సోకి ఇటీవల 12 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో కేరళలో ఆరోగ్య శాఖ తో పాటు కేంద్ర అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. వైరాలజీ శాస్త్రవేత్తలు మళ్లీ అధ్యయనం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. 2018లో నిఫా వైరస్ సోకిన క్రమంలో పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు కేరళ లో గబ్బిలాల పై అధ్యయనం జరిపారు. వైరస్ వ్యాప్తికి ఫలభక్ష గబ్బిలాలు ప్రధాన కారణమని కీటకాలను తినే గబ్బిలాల తో వైరస్ సోకలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది . ఈ పరిశోధనలో భాగంగా మరుసటి ఏడాది తెలంగాణలో కూడా  గబ్బిలాల పై అధ్యయనం చేశారు. వాటి లాలాజలం,విసర్జితలను సేకరించి విశ్లేషించారు. తాజాగా కేరళ లో వైరస్ వ్యాప్తి చెందుతున్నందున మరోసారి తెలంగాణలోను సర్వే జరగనుందని తెలిసింది. కేరళలో గబ్బిలాల ద్వారా నిఫా వైరస్ రెండు సార్లు సోకినప్పటికీ ఇప్పటివరకు దీన్ని జాడలు మన తెలంగాణ లో కనిపించలేవు .

భారత్లో తొలిసారి 2001లో పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో నిఫా రిపోర్ట్ అయింది. కేరళలోని మలప్పురం జిల్లా కోజికోడ్ లో 2018 లో వ్యాధి వ్యాప్తి చెందింది. మొదట వైరస్ సోకిన ప్రతి నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. ఆ తర్వాత లక్షణాల ఆధారంగా చికిత్స ద్వారా నియంత్రించారు. తెలంగాణలో 17 రకాల గబ్బిలాలు  ఉన్నాయి. అందులో ఫలభక్ష గబ్బిలాలు మూడు, మిగతా 14 కీటకాలను తినే గబ్బిలాలు ఉన్నాయి. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లోని హైకోర్టు, చిలుకూరు, మంజీరా, వరంగల్, జనగామ, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో వైరాలజీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

 అయితే దీని ప్రభావం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చని. మొదటిసారి కేరళలో వ్యాప్తి చెందినప్పుడు దీని జాడ తెలుగు రాష్ట్రాల్లో  ఎక్కడా కనిపించలేదని అన్నారు. మన రాష్ట్రాల్లో  మూడు రకాల పల భక్త గబ్బిలాలు ఉన్న వాటి ద్వారా ఇప్పటి వరకు ఏ వ్యాధి సోకలేదు అని అధ్యయనంలో వెల్లడైంది. గబ్బిలాలు వైరస్ రిజర్వాయర్ గా ఉన్నా  మనుషులకు నేరుగా హాని చేయవు. అవి తిని పారేసిన పండ్లను లేదా వాటి మాంసం తిన్నప్పుడు వైరస్ సోకుతుంది. ఈ గబ్బిలాల వల్ల ప్రమాదం లేదని, ఆందోళన చెందవద్దని జంతు శాస్త్ర వేత్త చెలిమిళ్ల  శ్రీనివాస్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: