పిల్ల‌ల‌కు కొవిడ్ టీకా అవ‌స‌ర‌మా.. వైద్యులు ఏం చెబుతున్నారు.?

Paloji Vinay
క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న క్ర‌మంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు , ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతూ పాఠ‌శాల‌లు తెరుచుకుంటున్నాయి. అయితే, పాఠ‌శాల‌ల‌ను తెర‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కొంద‌రు, అప్పుడే ఎందుకు తొంద‌ర‌ప‌డుతున్నార‌ని భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. వైద్య రంగం, విద్యా సంస్థ‌లు, త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఈ విష‌యంలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా ప్ర‌భావం పిల్ల‌ల‌పై త‌గ్గించ‌డానికి టీకా ఇవ్వాలా, వ‌ద్దా అనే మ‌రో చ‌ర్చ కూడా ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది. భార‌త్ లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ విష‌యంపైనే తీవ్ర చ‌ర్చ మెద‌ల‌యింది.

       బ్రిట‌న్‌లోని 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లల్లో ఉన్న ఆరోగ్య సమస్యల కార‌ణంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి అస‌మ్మ‌తిని వ్య‌క్తం చేసింది ఆ దేశ‌ వ్యాక్సిన్ అడ్వైజరీ బాడీ లేదా వ్యాక్సీన్ అడ్వైజింగ్ కమిటీ. పిల్ల‌ల్లో కొవిడ్ వైరస్ ప్రమాదం చాలా తక్కువగా ఉందని, వ్యాక్సిన్ ఇవ్వ‌డం ద్వారా చాలా తక్కువ ప్రయోజనం ఉంటుందని జాయింట్ కమిటీ ఆన్ వాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ (జేసీవీఐ) తెలిపింది. గుండె, ఊపిరితిత్తులు లేదా కాలేయ సమస్యలు ఉన్న పిల్లలకు క‌రోనా టీకా ఇవ్వలేమని వైద్య నిపుణులు  సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యవంతులైన పిల్లలతో పోల్చితే ఇలాంటి పిల్లలకు క‌రోనా ప్రమాదం ఎక్కువగా ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. ఇండియా కూడా పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇచ్చే విష‌యంలో వైద్య నిపుణులు ఏకాభిప్రాయానికి రాన‌ట్టు తెలుస్తోంది.

భారత్‌లో కాడిలా హెల్త్‌కేర్ జైకోవ్-డి టీకాను అక్టోబర్‌ మొదటి వారం లేదా రెండో వారం నుంచి 12-17 ఏళ్ల మ‌ధ్య ఉన్న‌ పిల్లలకు ఇవ్వనున్నారని, ఈ వ్యాక్సిన్‌ టీనేజర్లలో సురక్షితంగా, ప్రభావవంతంగా పని చేస్తుందని భారత ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టీఏజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా వెల్ల‌డించారు. కానీ, అనారోగ్యంగా ఉన్న పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌డంలో మొద‌టి ప్రాధాన్యం ఇస్తామ‌ని పేర్కొన్నారు ఆయ‌న‌. భార‌త దేశంలో కాడిలా హెల్త్ కేర్ వ్యాక్సిన్ ఆమోదం పొందింద‌ని దీని వల‌న ఎక్కువ‌గా నొప్పి ఉండ‌ద‌ని ఎన్‌కె ఆరోరా వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: