నిఫా వ్యాప్తి క‌రోనా కంటే త‌క్క‌వే..!

Dabbeda Mohan Babu
కేర‌ళ రాష్ట్రంలో ఇప్ప‌టికే అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. దీనికి తోడు ఆ రాష్ట్రంలో నిఫా వైర‌స్ ప‌డ‌గ విప్పుతోంది. దీంతో కొత్త ర‌కం వైర‌స్ తో కేర‌ళ ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతున్నారు. రెండు రోజుల క్రిత‌మే 12 ఏండ్ల బాలుడు నిఫా వైర‌స్ బారీన ప‌డి చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఆ బాలునితో ఇంకా ఎంత మంది నిఫా వైర‌స్ సోకిందో న‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు బిక్క బిక్క మంటున్నారు. ఆ బాలునితో ప్రైమ‌రీ కాంట్ర‌క్టు గా ఉన్న వారిని గుర్తించి వారిని ఐసోలేష‌న్ లో ఉంచారు. ఇప్ప‌టికే నిఫా వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టడానికి కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌డుతోంది. క‌రోనా వైర‌స్ ఎదుర్కొన్న‌ట్టు నిఫా వైర‌స్ నూ స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు.
క‌రోనా క‌న్న నిఫా వైర‌స్ వ్యాప్తి త‌క్కువ గానే ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. క‌రోనా అంతా పెద్ద అంటు వ్యాధి కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. కానీ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని వారు తెలిపారు. క‌రోనా తో పోలిస్తే నిఫా వైర‌స్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌దగా మారుతోంద‌ని వారు అన్నారు. నిఫా వైర‌స్ వ్యాప్తి కి మొద‌టి కార‌కం గ‌బ్బిలం.  ఈ గ‌బ్బిలాలు ఖర్జూర పండ్ల‌ను ఎక్కువ‌గా తింటాయి. ఇవి ఖ‌ర్జూర పండ్లు తిన్న స‌మ‌యంలో నిఫా వైర‌స్ ఉన్న గ‌బ్బిలాల లాలాజలం లేదా మూత్రం వంటి స్రావాలు పండ్లకు,  చెట్టుకు అంటుకుంటాయి. వాటిని మ‌నుషులు తాకితే వారికి నిఫా వైర‌స్ సోకుతుంది. అలాగే నిఫా వైర‌స్ సోకిన వ్య‌క్తి నుంచి వైరస్ సోకే ప్ర‌మాదం ఉంది. వైర‌స్ సోకిన వారి శ‌రీర స్రావాలు ఇత‌రుల‌కు అంటితే వారికి నిఫా వైర‌స్ వ‌స్తోంది.  మ‌న దేశంలో గ‌తం వ‌చ్చిన నిఫా వైర‌స్ కేసులు ఈ ర‌కానికి చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం.
నిఫా వైర‌స్ సోకిన వ్య‌క్తుల్లో కొంత మందికి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉంటాయి. మ‌రి కొంద‌రికి తీవ్ర మైన ల‌క్ష‌ణాలు సైతం ఉంటాయి. వైర‌స్ సోకిన కొంత మందికి మెద‌డు వాపు వ్యాధి వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. దీనితో ఆ వ్య‌క్తి మృతి చెందే అవ‌కాశం ఉంది. వీటితో పాటు జ్వ‌రం, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు ఉంటాయి. మెద‌డు వాపు వ‌చ్చిన వారు ఒక‌టి రెండు రోజుల్లో కోమాలోకి పోయే ప్ర‌మాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: