ఆ విష‌యంలో గ్లోబ‌ల్ వార్మింగ్ మంచిదేన‌ట‌.. ఎలాగో తెలుసుకోండి.

Paloji Vinay
    దోమ‌ల ద్వారా మ‌నుషుల‌కు అనేక ర‌కాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, ముఖ్యంగా జికా లాంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధులు వ‌స్తాయి. వీటి కార‌ణంగా ప్ర‌తి సంవ‌త్స‌రం 700 మిలియ‌న‌ల్ మంది జ‌నం అనారోగ్యం పాల‌వుతున్నారు. ఇందుల దాదాపు 10 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు చ‌నిపోతున్నారు. జికా, ఎల్లో ఫీవ‌ర్‌, చికున్ గున్యా, మ‌లేరియా, డెంగ్యూ వ్యాధులు అత్య‌ధికంగా వ్యాప్తి చెందిన‌ట్టు ప‌రిశోధ‌కులు గుర్తించారు. యూరోపియన్ సెంటర్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, గత 20 నుండి 30 ఏండ్ల‌లో ఏల్లో ఫీవ‌ర్ దోమల సంఖ్య చాలా పెరిగిందని, అవి అత్యంత వ్యాధిని మోసే దోమలలో ఒకటిగా మారాయని వెల్ల‌డించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, డెంగ్యూ వైరస్ ప్రతి సంవత్సరం 400 మిలియన్ల మందికి వ‌స్తే అందులో 25,000 మందిని బ‌లితీసుకుంటోంది. గత 50 సంవత్సరాలలో డెంగ్యూ కేసులు 30 రెట్లు పెరిగాయ‌ని  WHO వెల్లడించింది. డెంగ్యూ వైరస్ తో జ్వరం, శరీర నొప్పులకు దారితీస్తుంది. అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవ‌ల చేసిన పరిశోధనలో గ్లోబల్ వార్మింగ్ చేసే ప్ర‌యోజ‌నాల‌ను క‌నుగోన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా దేశంలో, ప్రపంచంలో డెంగ్యూ కేసులు తగ్గుతాయని శాస్త్రవేత్తలు వెల్ల‌డిస్తున్నారు.

 డెంగ్యూ వైరస్ క్యారియర్‌గా ఏడెస్ ఈజిప్టి దోమ మారినప్పుడు, దాని వేడి సహనం తగ్గుతుందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకురాలు ఎలిజబెత్ మెక్‌గ్రాత్ తెలిపారు. ఇది కాకుండా, దోమలలో ఈ వ్యాధిని నిరోధించే బ్యాక్టీరియా, వోల్బాచియా కూడా చాలా ఉత్తేజంగా మారుతుంద‌ని చెప్పారు. అందువల్ల, గ్లోబల్ వార్మింగ్ కారణంగా, డెంగ్యూ కేసులు తగ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు.

  దోమల మీద వాతావరణ మార్పుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవ‌డానికి  ఎలిజబెత్ ఓ ప్ర‌యోగాన్ని చేశారు. డెంగ్యూ, వోల్బాచియా సోకిన దోమలను సీసాలో ఉంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో ఉంచారు. ఈ ప్ర‌యోగంలో ఆ ఉష్టోగ్ర‌త‌లో దోమ‌లు నీర‌సంగా మారుతూ త‌రువాత చ‌నిపోవ‌డం జ‌రిగింది. అదే సమయంలో, వోల్బాచియా బ్యాక్టీరియా సోకిన దోమలు 4 రెట్లు ఎక్కువ నీర‌సంగా మార‌య‌ని ప్ర‌యోగంలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: