ఆ పండు తింటే నిఫా వస్తోందా?

Dabbeda Mohan Babu
కేర‌ళ రాష్ట్రాన్ని వైర‌స్ లు క‌ల‌వ‌ర పెడుతున్నాయి. గ‌త కొన్ని రోజుల నుంచి వేల సంఖ్య‌లో క‌రోనా వైర‌స్ కేసులు వ‌స్తున్నాయి. దీనికి తోడు కేర‌ళ రాష్ట్రంలో నిఫా వైర‌స్ కేసులు రావ‌డం అక్క‌డి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోన‌ల‌కు గురి చేస్తుంది. తాజాగా కోజికోడ్ జిల్లా లోని చాత్త మంగ‌ళం అనే గ్రామంలో 12 ఎండ్ల బాలుడు నిఫా వైర‌స్ సోకి మ‌ర‌ణించాడు. దీంతో అప్ర‌మ‌త్త‌న రాష్ట్ర ఆరోగ్య శాఖ దానికి వెతికే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌త్యేక బ్రుందం కేర‌ళ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తోంది. బాలుడికి నిఫా వైర‌స్ ఎలా సొకింది అనే విష‌యం పై అధ్య‌య‌నం చేసింది. ఈ అధ్యయ‌నంలో బాలుడు రంబుటాన్ అనే పండు తిన్నాడ‌ని బాలుడి కుటుంబ స‌భ్య‌లు తెలిపారు. దీంతో రంబుటాన్ పండ్లను వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న వారి శాంపిల్స్ తీసుకున్నారు. ఆ నామునాల‌ను పూణ‌లో ఉన్న నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపించారు. అలాగే బాలునితో ఉన్న వారిని గుర్తించి వారిని ప‌రిశీలిస్తున్నారు. అలాగే ఆ గ్రామం చుట్టు ప‌క్క‌ల ఆంక్ష‌లు విధించారు.
పండు తింటేనే నిఫా వైర‌స్ సొకుతోంద‌నే వార్త కేరళ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. క‌రోనా వైర‌స్‌తోనే ఇబ్బంది ప‌డుతుంటే కొత్త నిఫా వైర‌స్ రావ‌డంతో ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లాంటేనే జంకుతున్నారు.  ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో పాటు గ‌తంలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల నుంచి కేర‌ళ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది. గ‌త ఏడాది వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌లో అధిక ధ‌న ప్రాణ న‌ష్టం కేరళ‌కు వాటిల్లింది.  ఈ సంద‌ర్భంలో నిఫా వైర‌స్ వార్త‌లు కేర‌ళ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఈ నిఫా వైర‌స్ ఎంత మంది ప్రాణాల‌ను తీస్తుందో అని భ‌య‌ప‌డుతున్నారు. నిఫా వైర‌స్‌ను అరిక‌ట్ట‌డానికి త‌మ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాక మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ద‌ల‌ను క‌రోనా వైర‌స్ ను ధీటుగా ఎదుర్కొన్న కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం నిఫా వైర‌స్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: