వెల్లుల్లితో ఈ వ్యాధులు తగ్గుతాయా..!

MOHAN BABU
భారతీయ వంటలు లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లుల్లికి  ఒక ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి నీరుల్లి కి దగ్గర చుట్టం. అంతేకాదు మీరు కంటే కూడా వెల్లుల్లి ఔషధ గుణాలు ఎక్కువ. ఇక వెల్లుల్లి  వేసిన వంటలు చక్కని రుచి,వాసన వస్తాయి.ప్లేగు తో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వును కరిగించేది, పరాన్న బుక్కులని పరిగెత్తించేది, కొలెస్ట్రాల్ని కత్తిరించేది, కేన్సర్ను నిరోధించేది.. రక్తపోటును నివారించేది, వీర్యానీ వృద్ధి చేసేది, తామర ని తగ్గించేది,జీర్ణశక్తిని పెంచేది. ఇలా శరీరంలోని ఇంకా వ్యాధులకు చెక్ పెట్టే శక్తి వెల్లుల్లికి ఉంది. ఇక ఆస్తమా శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పని చేస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు వెళ్ళు దివ్యౌషధం.

మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రకాల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని ప్రాచీనకాలం నుంచి ఉన్న నమ్మకం. అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాల్లో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. వెల్లుల్లి లో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలంటే వెల్లుల్లి ని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రసం తాగవచ్చు. ఇలా కూడా చేయలేము అనుకునేవారు వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకొని వాటిని కాల్చి తినవచ్చు. పెనం మీద కొంచెం నెయ్యి వేసి అందులో వెల్లుల్లి వేయించి తినవచ్చు. వెల్లుల్లి కషాయంగా చేసుకొని తాగవచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకొని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండుసార్లు కప్పు మోతాదులో తాగవచ్చు. ఇలా వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నివారింపబడతాయి. హై బీపీ నియంత్రణలోకి వస్తుంది. బి.పి తగ్గుతుంది. శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

అందువల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వెల్లుల్లి లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక లివర్ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తింటే ఎంతో మంచిది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకల దృఢంగా, ఆరోగ్యంగా మారతాయి. ఇక వెల్లుల్లి తినలేము అనుకునేవారు టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వైద్య సూచనలను అనుసరించి ఆ టాబ్లెట్స్ ను ఉదయం, సాయంత్రం భోజనానంతరం ఒకటి చొప్పున 250 మి. గ్రా మోతాదులో తీసుకోవాలి. రోజూ తినే ఆహారంలో వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకోండి.ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: