పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ 2/3 ట్రయల్స్ కోసం ఆమోదం..!

Divya
కరోనా మహమ్మారి త్వరలోనే మూడవ రూపాంతరం గా మారి ,చిన్న పిల్లలపై ప్రభావం చూపిస్తుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన విషయం తెలిసిందే. అయితే చిన్న పిల్లలకు ఇప్పటివరకు ఎలాంటి టీకాను తయారు చేయలేదు. ఇకపోతే ఇప్పుడు సరికొత్తగా రూపొందించిన టీకాల తో చిన్నపిల్లలపై ట్రయల్స్ చే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
ఇక బయోలాజికల్... కొవిడ్-19 వ్యాక్సిన్ యొక్క దశ 2/3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం కోసం ఆమోదం పొందినట్లు సమాచారం. ఇందులో ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు.. ఈ ట్రయల్స్ కు అర్హులు అని బయోలాజికల్ స్పష్టం చేసింది. కౌమారదశలో ఉన్న పిల్లలకు కార్బేవాక్స్  పిల్లలపై క్లినికల్ ట్రయల్ నిర్వహించడం కోసం బయాలజికల్ ఆమోదం పొందిందని బయోటెక్నాలజీ విభాగం శుక్రవారం తెలిపింది.

పిల్లల్లో ఇమ్యూనిటీ శక్తిని పెంచడం కోసం ట్రయల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2021  సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన పిల్లలపై ట్రయల్ చేయడానికి బయోలాజికల్ ఆమోదం పొందింది. ఇక ఈ విషయంపై బయోలాజికల్ ఇ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల మాట్లాడుతూ.. ఈ ఆమోదం ను  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో తదుపరి ఫైలింగ్ లకు మద్దతు ఇస్తామని తెలిపారు. ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చెందిన జైడస్ కాడిలా యొక్క సూది లేని కొవిడ్-19 వ్యాక్సిన్ ZyCoV -D నియంత్రకం నుండి అత్యవసర వినియోగ అధికారాన్ని కొనడం జరిగింది. ఇక ఈ ఔషధాన్ని దేశంలో ఉన్న 12 నుంచి 18 సంవత్సరాల వయసులో నిర్వహించే మొదటి టీకా గా దీనిని పరిగణించవచ్చు..

అయితే కొన్ని షరతులతో 2 నుండి 17 సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలకు కోవో వాక్స్ దశ 2/3 ట్రయల్స్ నిర్వహించడానికి సీరం  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డి సి జి ఐ జూలైలో అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: