టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

Divya
దేశంలో చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి టీ తాగనిదే వారికి ఆ రోజంతా అసంపూర్ణంగా అనిపిస్తుందని, ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఋజువైంది.. ముఖ్యంగా ఈ టీ అనేది సరిహద్దులు దాటిన వ్యక్తులను ఒకచోట కలిసినప్పుడు తాగడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ టీ ని కనుక సరిగ్గా చేసినట్లయితే ఎన్నో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు . అయితే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మీరు కూడా ఒకసారి చదివి తెలుసుకోండి.
రోజుకు టీ ని ఎంత మొత్తంలో తీసుకోవాలి అంటే, నిపుణులు చెప్పిన అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి రోజుకు రెండు నుంచి మూడు కప్పుల టీ ని మాత్రమే తాగాలి. అయితే ఈ టీ ని ఖాళీ కడుపుతో తాగకూడదు. ఏదైనా తిన్న తర్వాత తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా వుంటాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా నీళ్ళ తర్వాత ఉపయోగించే కేవలం టీ మాత్రమేనట. అయితే ఈ విషయాన్ని తీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అండ్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ టీ ని తాగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వైరస్ లు,టైప్ 2 డయాబెటిస్ ,నాడీ సంబంధిత వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
అంతేకాదు ఎఫ్డీఏ ప్రకారం బ్లాక్ తో పాటు గ్రీన్ టీ కూడా రెండు గుండెకు మంచివే. సహజ మొక్కల భాగాల నుంచి తయారవుతాయి కాబట్టి ఈ టీ తాగడం వల్ల గుండె ప్రమాదాలు రావడం చాలా తక్కువట..
ఈ టీ ని తీసుకోవడానికి సరైన సమయం ఏదైనా ఉంది అంటే,  బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మాత్రమే ఈ టీ ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా 99 శాతం కంటే అధికంగా నీరు ఉంటుంది. కాబట్టి శరీరం డీహైడ్రేట్ కాకుండా అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు కూడా కేవలం రోజుకు రెండు నుంచి మూడు కప్పులు మాత్రమే ఈ టీ ని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: