ఈ చిన్న ట్రిక్ తో గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతం

Vimalatha
చిరునవ్వు ముఖానికి వెలకట్టలేని ఆభరణం విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ చిరునవ్వులో ముఖపాత్రను పోషించేది మాత్రం పెదవులు. పెదవులు అందంగా, ఎర్రగా ఉంటే అందానికే అందం మరి. అయితే కొంతమంది పెదవులు నల్లగా మారుతుంటాయి. పెదవులు ఎంత గులాబీ రంగులో ఉంటే, చిరునవ్వు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. కానీ పెదవులకు తేమ తగ్గడం, సౌందర్య ఉత్పత్తుల వాడకం వల్ల నల్లగా మారి వాటి అందం తగ్గుతుంది. కానీ రాత్రిపూట ఈ టిప్స్ పాటిస్తే గులాబీ రేకుల్లాంటి పెదాలు మీ సొంతం.
మృదువైన, గులాబీ రంగు పెదాల కోసం కావలసింది 1 బీట్‌రూట్ ముక్క. రాత్రి పడుకునే ముందు బీట్‌రూట్‌ను బాగా కడిగి దాని ముక్కను కత్తిరించండి. ఈ బీట్‌రూట్ ముక్కను బాగా తురుముకోవాలి. మిక్సర్‌లో కూడా వేయవచ్చు. ఇప్పుడు ఈ బీట్‌రూట్ పేస్ట్‌ని పెదవులపై బాగా అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత పత్తి సహాయంతో తొలగించండి. పెదవుల నుండి బీట్‌రూట్ తొలగించిన వెంటనే, లిప్ బామ్ రాసుకొని నిద్రపోండి. ఉదయం మీ ముఖం, పెదాలను నీటితో కడగండి.
బీట్‌రూట్‌లో బ్లీచింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. అది పెదవుల రంగును మెరుగుపరచడంతో పాటు తేమను కూడా అందిస్తుంది. బీట్‌రూట్‌లో ప్రోటీన్, ఐరన్, సిలికా, నైట్రేట్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ధూమపానం మానుకోండి. రాత్రిపూట లిప్ స్టిక్ వేయడం మానుకోండి. ముఖ్యంగా అస్సలు డిహైడ్రేట్ అవ్వొద్దు. మరింత ఈజీగా గులాబీ పెదవులు పొందడానికి మీరు నిద్రపోయే ముందు ఒక చిన్న బీట్‌రూట్ ముక్కను పెదవులపై తేలికగా రుద్దండి. రుద్దిన తర్వాత, లిప్ బామ్ రాసుకొని నిద్రపోండి. ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కోండి. పెదవుల రంగును గులాబీ రంగులో చేయడానికి ఈ రెండు మార్గాలూ అద్భుతంగా పని చేస్తాయి. మీరు ఒకే రాత్రిలో తేడాను గమించవచ్చు. రెగ్యులర్ గా ఇలా చేస్తుంటే లిప్ స్టిక్ అవసరమే ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: