'ఎబిసి' జ్యూస్ సర్వరోగ నివారిణి...!!

Sravani Manne
'ఎబిసి' జ్యూస్ సర్వరోగ నివారిణి...!!

'ఎబిసి' జ్యూస్ ఏంటి అనుకుంటున్నారా?? అవును అండి ఈ జ్యూస్ యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు.ఆయుర్వేదంలో ఈ జ్యూస్ ను సర్వరోగ నివారిణి అంటారు.దానిని ఇంటిలోనే  ఈజీగా తయారు చేసుకోవచ్చు.దాని ఎలా తయారు చేసుకోవాలో,ఉపయోగాలు తెలుసుకుందాం.

కావలసిన పదార్దాలు:

ఆపిల్:1

బీట్ రూట్:1

క్యారెట్:2

మింట్ లీవ్స్:కొన్ని

హనీ:2 టేబుల్ స్పూన్

లెమన్ జ్యూస్:1 టేబుల్ స్పూన్

షుగర్:1 టేబుల్ స్పూన్(ఆప్షనల్)

నీరు:3 కప్పులు

తయారీ విదానం:

ముందుగా ఒక మిక్సి జార్ తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకున్న ఆపిల్, బీట్ రూట్, క్యారెట్  వేసి తర్వాత మింట్ లీవ్స్,హనీ,లెమన్ జ్యూస్,షుగర్ వేసి నీరు పోసుకున్నాక మెత్తగా రుబ్బుకోవాలి.అంతే మన 'ఎబిసి' జ్యూస్ రెడీ ఐయినట్టే.

ఉపయోగాలు:

ఈ జ్యూస్ గుండెకి బాగా ఉపయోగపడుతుంది.ఇందులో వాడిన ఆపిల్, బీట్ రూట్, క్యారెట్ ఈ మూడు పదార్దాలు గుండెకి కవచం లాగా పనిచేస్తుంది.ఇందులోని ఎన్నో 'మినరల్స్,విటమిన్లు' బాడీలోకి చేరాకా సమస్యలను దూరం చేస్తుంది.ఈ జ్యూస్ రెడ్ 'బ్లడ్ షుగర్ లెవల్ని' తగ్గిస్తుంది.దాంతో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.ఇందులో 'విటమిన్ ఏ' పుష్కలంగా లభిస్తుంది.ఈ జ్యూస్ వల్ల 'మచ్చలు లేని' చర్మం లబిస్తుంది.ఇది కళ్ళకి మంచిది.ఇది ఇమ్యూన్ సిస్టం ని అభివృద్ధి చేస్తుంది.ఇది బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఒక వరంగా చెబుతారు. రోజు ఈ జ్యూస్ను 'వెయిట్ లాస్ డైట్' లో దీన్ని బాగం చేసుకోవచ్చు.దాని వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు.ఇది 'లో కెలొరీ ,హై ఫైబర్' ఉంటుంది. చాలా మందికి  'జీర్ణ సమస్య'లతో బాధపడుతూ ఉంటారు.తిన్నది అరగాకపోవటం,వాంతులు కావడం,మల బద్ధకం,ఇలాంటి వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.ఇది అనేక సమస్యలకు మంచి ఫలితంగా ఉంటుంది.ఈ జ్యూస్ ఉదయం పరగడుపున తీసుకుంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయని పరిశోదనలో తేలింది.ఆయుర్వేదంలో ఈ జ్యూస్ ను సర్వరోగ నివారిణి అంటారు.ఈ జ్యూస్ ని 24-72 గంటల ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇంటిలోనే  ఈజీగా తయారు చేసుకోoడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: