ఇంటిలోనే 'డిటాక్స్ వాటర్' తయారు చేసుకోండి ఇలా...!

Sravani Manne
మనకు తెలిసిన సెలేబ్రేటీస్ ఎక్కువగా విదేశాల నుండి తెప్పించిన వాటర్ తాగుతూ ఉంటారు.దీనికి కారణం వాటిలో పోషకాలు కలపడమే.వీటిలో మినరల్స్ ని ఇన్ఫుజ్ చేస్తారు.అదే ఈ వాటర్ యొక్క ప్రత్యేకత. 'డిటాక్స్ వాటర్' అంటే మనలోని 'టాక్సిన్స్' ని తగ్గించేది అని అర్ధం.అలాంటి వివిధ రకాల 'డిటాక్స్ వాటర్' మనం ఇంటిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.

అలాంటి 'డిటాక్స్ వాటర్' గురించి కొన్ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.బరువు తగ్గటానికి ఉపయోగ పడే 'డిటాక్స్ వాటర్' గురించి తెలుసుకుందాం.


వాటర్ మిలాన్,ప్రోమోగ్రనేట్ 'డిటాక్స్ వాటర్':

కావాల్సిన పదార్దాలు:

పుచ్చకాయ ముక్కలు:1 కప్పు.

దానిమ్మ ముక్కలు:1 కప్పు.

నీరు:1 లీటర్.

ఉప్పు:చిటికెడు(ఆప్షనల్)

తయారి విదానం:

ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో  ముక్కలు, దానిమ్మ ముక్కలు, ఉప్పు వేసి నీరు పోసి ఒకసారి కలపాలి.అంతే వాటర్ మిలాన్,ప్రోమోగ్రనేట్ 'డిటాక్స్ వాటర్' రెడీ.మూడు గంటల తర్వాత అలా పక్కన పెట్టేసి తరువాత తాగటమే.


ఫ్రూట్స్ 'డిటాక్స్ వాటర్':

కావాల్సిన పదార్దాలు:

ఆరంజ్:1

ఆపిల్:1

దానిమ్మ:1

కివి:1

లెమన్:1

మెంతులు:10

పుదినా:కొంచం

దాల్చిన చెక్క పొడి:చిటికెడు.

నీరు:2 లీటర్

తయారి విదానం:

ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో  గుండ్రంగా కట్ చేసుకున్న ఆరంజ్ వేసుకుకోవాలి. 'డిటాక్స్ వాటర్'లో ఫ్రూట్స్ స్కిన్ తీయకుండా వాడాలి.తరువాత ముక్కలుగా కట్ చేసిన ఆపిల్ వేసుకుకోవాలి.తర్వాత వరుసగా దానిమ్మ,కివి, లెమన్, మెంతులు, పుదినా, దాల్చిన చెక్క పొడి, నీరు వేసి కలుపుకోవాలి. మూడు గంటల తర్వాత అలా పక్కన పెట్టేసి తరువాత తాగటమే.


పుదినా, లెమన్ 'డిటాక్స్ వాటర్':

లెమన్:1

పుదినా:10 ఆకులు

నీరు:1 లీటర్.

తయారి విదానం:

ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో  గుండ్రంగా కట్ చేసుకున్న లెమన్ ఆరంజ్ వేసుకుకోవాలి. తరువాత పుదినా వేసి నీరు వేసి కలుపుకోవాలి. అంతే పుదినా, లెమన్ 'డిటాక్స్ వాటర్ రెడీ. మూడు గంటల తర్వాత అలా పక్కన పెట్టేసి తరువాత తాగటమే.దీనిని బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి వరంగా ఉపయోగపడుతుంది అని చెబుతారు.అలాంటి వివిధ రకాల 'డిటాక్స్ వాటర్' మనం ఇంటిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: