పాల ఉత్పత్తులు కల్తీనా... చిటికెలో తెలుసుకోండిలా !

Vimalatha
పాలు, పాల ఉత్పత్తులు నెయ్యి, పనీర్, కోవా మొదలైనవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ నేటి కాలంలో చాలా మంది లాభాలను ఆర్జించడానికి పాలు, దాని నుండి తయారైన ఉత్పత్తులను కల్తీ చేయడం ప్రారంభించారు. కల్తీ పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవ్వొచ్చు. కానీ మీరు కల్తీ పాలు, కల్తీ పనీర్, కల్తీ నెయ్యిని ఈజీగా గుర్తించొచ్చు.
పాలలో నీటిని ఎలా గుర్తించాలి
FSSAI ప్రకారం నకిలీ, నిజమైన పాలను గుర్తించడానికి ముందుగా పాలిష్ చేసిన, వాలుగా ఉన్న ప్రదేశంలో ఒక చుక్క పాలు ఉంచండి.
పాలు స్వచ్ఛంగా ఉంటే అక్కడే ఉంటుంది లేదా నెమ్మదిగా క్రిందికి వెళ్లి పొడవైన తెల్లటి బాటను ఏర్పరుస్తుంది.
పాలలో నీరు కలిపితే అది ఎలాంటి జాడను వదలకుండా కిందకు జారిపోతుంది.
పాలలో డిటర్జెంట్‌ను ఎలా గుర్తించాలి?
5 మి.లీ నుండి 10 మి.లీ పాలను తీసుకొని అదే మొత్తంలో నీటిలో కలపండి.
ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
పాలలో డిటర్జెంట్ కలిపితే మందపాటి సబ్బు నురుగు పెరగడం ప్రారంభమవుతుంది.
స్వచ్ఛమైన పాలు కదిలిస్తే కొంచెం నురుగ మాత్రమే వస్తుంది.
పాల ఉత్పత్తులలో పిండి పదార్ధాలను ఎలా గుర్థించాలంటే...
2-3 మి.లీ పదార్థాలను అంటే కోవా, పనీర్ వంటివి 5 మి.లీ నీటితో ఉడకబెట్టండి.
అది చల్లబరచండి. దానికి 2 నుండి 3 చుక్కల అయోడిన్ టింక్చర్ జోడించండి.
మిశ్రమానికి నీలం రంగు ఉంటే అది స్టార్చ్‌కు సంకేతం. రంగు తెల్లగా ఉంటే,మీ పన్నీర్, కోవా స్వచ్ఛంగా ఉంటాయి.
నకిలీ నెయ్యిని ఎలా గుర్తించాలి?
అర టీస్పూన్ నెయ్యి లేదా వెన్నని పారదర్శక పాత్రలో ఉంచండి.
ఇప్పుడు దానికి 2 నుండి 3 చుక్కల అయోడిన్ టింక్చర్ జోడించండి.
తియ్యటి బంగాళా దుంపలు, మెత్తని బంగాళాదుంపలు లేదా ఇతర పిండి పదార్ధాలు ఆ నెయ్యిలో కలిపితే దాని రంగు నీలం రంగులోకి మారుతుంది. అది కల్తీ నెయ్యి అని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: