మీకు ఈ రైస్ తింటూ 'బరువు' తగ్గొచ్చు తెలుసా....?

Sravani Manne
మీరు ఎప్పుడైనా 'క్వినోవా' రైస్ గురించి విన్నారా?ఆ రైస్ తింటూ బరువు తగ్గొచ్చు అన్న విషయం తెలుసా.అవి చూడటానికి కొర్రలను పోలి ఉంటాయి.గోధుమలతో పోలిస్తే ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.ఈ 'క్వినోవా'లో ప్రత్యేకత ఏమిటంటే వీటిల్లో 'గ్లూటేన్' ఉండదు.ఈ రైస్ స్పెషాలిటి 'గ్లూటేన్' లేకపోవడమే.దాంతో పిండిపదార్థాలు అతిగా తినడం వల్ల వచ్చే వూబకాయం,మధుమేహం,హృదయ సమస్యలు ఈ రైస్ తినటం వల్ల రావు.పైగా వీటిలో ప్రోటీన్శాతం ఎక్కువుగా ఉండే ఇతర పదార్దాల కాకుండా బియ్యం,గోధుమలకు బదులుగా వాడుకోవచ్చు.


పొట్టు తీసిన ఈ ధాన్యాన్ని అన్నంలానే వండుకోవచ్చు. కిచిడీలూ,బిర్యానీలు,బిస్కెట్స్,కేకులలో ఇలా అన్నీ చేసుకోవచ్చు. దాంతో సలాడ్ల తయారీలో వాడుకోవడం సులభం. ముఖ్యంగా సలాడ్లలో ఈ గింజలు చక్కగా సరిపోతాయి. ఇతర ఆకుకూరల్లానే ఈ మొక్క ఆకుల్నీ తింటారు.వంద గ్రాముల 'క్వినోవా'లో పోషకాలు ఈ విధంగా ఉంటాయి.కేలోరీలు 368,ప్రోటీన్లు 14 గ్రా,పిండి పదార్దాలు 64 గ్రా,పీచు పదార్దం 6 గ్రా,పొటాషియం 563 మిగ్రా ఇంకా చాలా పోషకాలు లబిస్తాయి.


గోధుమ, ఎరుపు, ముదురు గోధుమ, నలుపు, గులాబీ రంగుల్లో ఇవి పండుతాయి. గ్లూటెన్ రహితమైన ఈ ధాన్యాన్ని ఇటీవల అమెరికన్లూ యూరోపియన్లూ ఎక్కువగా తింటున్నారు. దాంతో ఏటికేడాది వీటి ఉత్పత్తి సైతం పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి గతేడాదిని అంతర్జాతీయ క్వినోవా సంవత్సరంగానూ ప్రకటించిందంటే వీటి విశేషాన్నితెలుసుకోవచ్చు. సుమారు ఏడువేల సంవత్సరాల క్రితమే ఆండెస్ పర్వతశ్రేణుల్లోని దక్షిణ అమెరికన్లు వీటిని సాగుచేసేవారు. యోధులకు నీరసాన్ని రానివ్వదన్న కారణంతో స్థానికులు క్వినోవాను బంగారంగా భావించేవారు. ప్రస్తుత నిపుణులు సైతం దీన్ని 'సూపర్‌గ్రెయిన్ ఆఫ్ ద ఫ్యూచర్'గా చెబుతున్నారు. కాగా దీన్ని పండిచటం తేలిక.ఎకరాకు 17 వేల ఖర్చుతో 10 నుండి 12 క్వింటాళ్ల దిగుమతిని పొందవచ్చు.వీటికితెగుళ్ళ బాధ కూడా ఉండదు. బారతీయ మార్కెట్లో 'క్వినోవా' ధర  కేజీ 120 రూపాయలు పలుకుతుoది.ఇప్పుడు స్త్రీలలో ఎక్కువ ఐన పిసిఒడి(pcod) సమస్యను తగ్గిస్తుంది అని పరిశోధనల ద్వార తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: