పిల్లల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఈ చిట్కాలు పాటించండి?

Veldandi Saikiran
చిన్న పిల్లలను మనం ఎంత బాగా చూసుకుంటే వారు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వచ్చే వ్యాధులపై మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. పిల్లలకు సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా కరోనా మూడవదశ రానున్న నేపథ్యంలో.. మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చిన్నపిల్లలకు ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులను ఎలా నివారించాలి ఇప్పుడు చూద్దాం.
దోమలు కుట్టకుండా చూసుకోవాలి : దోమలు కుట్టడం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకు పొడవాటి దుస్తులు వేసి.. జాగ్రత్తలు వహించాలి. అలాగే ఇంటి పరిసరాలలో  నిల్వ నీరు... అస్సలు ఉంచకూడదు. దాని వల్ల  దోమలు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
పర్సనల్ హైజీన్ : చిన్నపిల్లల చర్మాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు  ఎక్కడో ఎక్కడో ఆడుకుంటారు కాబట్టి.. ఎప్పటికప్పుడు వారి చేతులను శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా భోజనం చేసే ముందు చిన్న పిల్లల చేతులు కచ్చితంగా కలగాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు.. చిన్న పిల్లలకు కూడా ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలి.
సామాజిక దూరం పాటించాలి :  కరోనా మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలను అస్సలు బయటకు పంపకూడదు. ఒకవేళ ఎమర్జెన్సీ సమయాలు పంపాల్సి వస్తే... సామాజిక దూరం పాటించాలని పిల్లలకు చెప్పాలి. అలాగే వారికి మాస్క్ ధరించడం పై అవగాహన కల్పించాలి. అంతేకాదు రోగ నిరోధక శక్తి పెంచి ఎటువంటి ఆహారాన్ని వారికి అందించారు.
ఆహారము మరియు మంచినీళ్లు : పిల్లలకు పోషకాలు ఉన్న ఆహారం మాత్రమే పెట్టాలి. చిన్న పిల్లలకు ఎక్కువగా మంచి నీళ్లు తాగించాలి. ముఖ్యంగా మరిగించిన నీళ్లు పిల్లలకు పెట్టడం వల్ల వారికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
రెస్పిరేటరీ సిస్టమ్ ప్రొటెక్ట్ చేయాలి : చిన్న పిల్లలకు రెస్పిరేటరీ సిస్టమ్ బాగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు చిన్న పిల్లలతో ఎక్ససైజ్ మరియు యోగా లాంటి వి  చేయించాలి. ముఖ్యంగా  వారితో సాయంత్రం పూట గేమ్స్ ఆడి పించాలి. దీనివల్ల ఉల్లాసం పెరిగి... పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. చిన్న పిల్లలు మానసికంగా కూడా దృఢంగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: