దాల్చిన చెక్క - తేనె కలిపి తీసుకుంటే... ఏం జరుగుతుందో తెలుసా...?
చాలా మంది మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇందులో నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తొలగించుకోవాలంటే బియ్యం కడిగిన నీటిని తీసుకొని అందులోకి మూడు స్పూన్లు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేసి తాగడం వల్ల ఒక సమయములో వచ్చే నొప్పి తగ్గుతుంది.
నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నవారు దాల్చిన చెక్క పొడిని నీటితో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసి పేస్టును నుదుటి పైన పెట్టడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
కొంతమందికి అప్పుడప్పుడు గుండె పట్టేసినట్లు ఉంటుంది. అలా జరిగినప్పుడు దాల్చిన చెక్క పొడి తీసుకొని, లోకి కొంచెం యాలకుల పొడి కలిపి బాగా మరగనివ్వాలి. ఈ కషాయాన్ని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
చర్మంపై దురద, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క పొడి తీసుకొని అందులోకి వేడిచేసిన తేనె కలిపి చర్మానికి రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి.
చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి దాల్చిన చెక్క పొడి బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడి లో కొద్దిగా తేనె కలిపి క్రమం తప్పకుండా రోజూ మూడుసార్లు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తీసుకొని అందులోకి రెండు స్పూన్లు దాల్చినచెక్క పొడి, చక్కెర వేసి తాగుతూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది