క్యారెట్ ఫేస్ ప్యాక్ తో ముఖం మెరిసిపోతుంది... అది ఎలా అంటే..?

kalpana
 క్యారెట్టు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కంటి చూపు మెరుగు పడటానికి క్యారెట్ తినడం మంచిది. క్యారెట్ లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం వల్ల కంటి సమస్యలను తొలగిస్తుంది. కంటి చూపు మెరుగుపరచడానికి కూడా క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. క్యారెట్టు ఆరోగ్యం కోసమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా వాడవచ్చు. క్యారెట్ లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. అందుకే ముఖము కాంతివంతంగా మెరవడం అంటే క్యారెట్ తో ఫేస్ ప్యాక్ చేసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల  ముఖం కాంతివంతంగా ఉంటుంది. క్యారెట్ తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో? దానిని ఎలా వాడాలో? వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం...

 ముఖం కాంతివంతంగా మెరవడానికి క్యారెట్ తో ఫేస్ ప్యాక్ తయారు చేయు విధానం 4 స్పూన్లు  క్యారెట్ జ్యూస్ తీసుకుని, రెండు స్పూన్లు  బొప్పాయి జ్యూస్, కొద్దిగా పాలు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం  పై ఉన్న దుమ్ము ధూళి పోయి  ముఖము కాంతివంతంగా ఉంటుంది.

 క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే యాంటీ ఏజింగ్ కారకంగా కూడా బాగా పనిచేస్తుంది. రెండు స్పూన్లు  క్యారెట్ జ్యూస్ తీసుకుని, అందులోకి అరటిపండు గుజ్జు, గుడ్డులోని  తెల్లసొన, నాలుగు చుక్కలు నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. క్రమాన్ని ముఖానికి మర్దన చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న ముడతలు తొలగిపోతాయి. అంతేకాకుండా ముఖము అందంగా కనిపిస్తుంది.

 జుట్టు  ముఖంతో ఉన్న వాళ్ళు ,  చెమట ఎక్కువగా పట్టే వాళ్ళు క్యారెట్ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల బాగా పనిచేస్తుంది. ఇందుకుగాను ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ రసం తీసుకొని, అందులో కొద్దిగా తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. మిశ్రమాన్ని ముఖానికి  పట్టించి 15  నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖం పైన జిడ్డు పోయి ముఖం ఫ్రెష్ గా తయారవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: