పోషకాలు పోకుండా ఉండాలంటే.. వండేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...!

kalpana
 శరీరానికి  పోషకాలు అందాలని అనేక కూరగాయలు, పండ్లు తింటూ ఉంటాము. ఇవన్నీ సరిగ్గా అందినప్పుడే  ఆరోగ్యంగా ఉంటాము. అలా ఉండాలంటే మనం  తినే ఆహార పదార్థాల్లో పోషకాలు పోకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలున్న ఆహారం తీసుకుంటాం.  ఇందులో పోషకాలు లేకుండా పోతే మనకే లాభం ఉండదు.  కాబట్టి పోషకాలు పోకుండా ఉండడానికి కొన్ని చిట్కాలను ఉపయోగించుకోవాలి. ఆ చిట్కాల  వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...                                          

 కొన్ని కూరగాయల్లో అనేక  పోషకాలు ఉంటాయి. కానీ వాటిని వండేటప్పుడు పోషకాలు  పోతాయి. అందుకే వండేటప్పుడు ఒకటి జాగ్రత్తలు తీసుకొని పడుకోవడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు అలానే ఉంటాయి.

 క్యారెట్, ముల్లంగి వంటి వాటిని వండుకునే టప్పుడు ఉడికిన తర్వాత ముక్కలు కోయకూడదు. ముందుగా ముక్కలు కోసుకొని ఆ తర్వాత ఉడికించుకోవాలి. అప్పుడు వాటిలో ఉండే కెరొటినాయిడ్స్ నే యాంటీ ఆక్సిడెంట్లు విడుదలవుతాయి. ఇవి అనేక రోగాలు నయం చేయడమే కాకుండా, క్యాన్సర్ కణాలను  నాశనం చేస్తాయి.

 ఆకు  కూరలు ఉడికించేటప్పుడు అందులో  ఉండే పోషకాలు పోకుండా ఉండాలంటే, వండుకునే టప్పుడు అందులోకి కొంచెం ఆలీవ్ నూనెను వేస్తే అవి వరకు నాకు కూడా ఇందులో ఉండే పోషకాలు బయటికి పోవు.

 వెల్లుల్లిని వాడేటప్పుడు తరిగిన తర్వాత వెంటనే పోపులో వేయకుండా, ఐదు నిమిషాల సేపు అలానే ఉంచి ఆ తర్వాత పోపు లో వేయడం వల్ల వెల్లుల్లిలో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పెరుగుతాయి.

 బంగాల  దుంపలను ఉడికించి ఎప్పుడు పొట్టు చాలామంది పొట్టుతీసి ఉడికిస్తూ ఉంటారు ఇలా చేయకపోవడం మంచిది. పొట్టుతో  సహా ఉడికించడం వల్ల విటమిన్ సి స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేటప్పుడు ఆ పాత్ర పై మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు  పోకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: