పచ్చి బఠాణీలు తింటున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

Divya

పచ్చిబఠాణీ లను ఒక్కొక్కరు ఒక్కో రకంగా,  తమకు నచ్చిన విధంగా వండుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఎలా వండినప్పటికీ వాటి రుచి అలాగే ఉంటుంది. పోషకాలు కూడా అంతే స్థాయిలో లభిస్తాయి అంటున్నారు నిపుణులు. అయితే పచ్చిబఠాణీ లను తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పచ్చి బఠాణీలను ప్రతి రోజు తినడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. వీటి లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించి, జీర్ణక్రియ పనితీరును అభివృద్ధి చేస్తుంది. అంతే కాకుండా సుఖ విరోచనం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పచ్చిబఠాణీలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎటువంటి జీర్ణ క్రియ సమస్యలైన ఇట్టే దూరం అవుతాయి.. ఇందులో ఉండే ఐరన్ రక్తం అభివృద్ధికి దోహదపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఈ పచ్చి బఠాణీలను తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

వీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే పచ్చి బఠాణీలలో ఫైటో అలెక్సిన్స్ అనబడే ఆంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతాయి. అలాగే జీర్ణశయం లో ఏర్పడే అల్సర్లు, క్యాన్సర్ ల వంటి ప్రమాదకరమైన కణాలను కూడా నాశనం చేస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. పురుషుల ఆరోగ్యానికి ఎంతగానో మేలు. పురుషులలో శుక్రకణాల స్థాయిని కూడా పెంపొందించి, స్త్రీలలో సంతాన లోపాన్ని నియంత్రిస్తుంది.

పచ్చి బఠాణీలలో  ఇన్సల్యూబుల్ ఫైబర్ ఉండటం వల్ల హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇక పచ్చిబఠాణీలలో లూటిన్ అనబడే కెరోటీనాయిడ్స్ ఉండడంవల్ల కళ్ళల్లో శుక్లాలు రాకుండా కాపాడుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడి, కంటి చూపు పెరుగుతుంది. పచ్చి బఠాణీలలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు. వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడం  వల్ల ఆకలిని నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు  ఎక్కువ ఆహారం తీసుకోకుండా దోహదపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: