పుచ్చ గింజలు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి....
పుచ్చకాయ గింజల నుంచి సేకరించిన తర్వాత కొద్ది రోజులు ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని పొడిగా చేయండి. 2 లీటర్ల నీటిలో 2 టేబుల్ స్పూన్ల పుచ్చ గింజల పొడి వేసి 15 నిమిషాలు మరిగించాలి. ఈ పొడిని రెండు రోజులు తాగాలి. మధ్యలో ఒక్క రోజు విరామం ఇవ్వాలి. ఆ తర్వాత వరుసగా రెండు రోజులు తాగాలి. ఇలా చేయడం వల్ల పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ శరీరానికి దక్కుతాయి.పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది. ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు. పుచ్చకాయ గింజలను ఆహారం తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే.. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.
జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చ గింజలు తోడ్పడతాయి. వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్లబర్చుకోవడానికి పుచ్చకాయలు ఉపయోగపడతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్లో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికం. పుచ్చకాయలో అధిక క్యాలరీలు కూడా ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్. పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...