ఎండు కొబ్బరి ని తింటున్నారా..? అయితే గమనించాల్సిన విషయం ఏమిటో తెలుసా..!

Divya
కొబ్బరికాయ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఇప్పటివరకు తెలుసుకున్నాము. ముఖ్యంగా ప్రస్తుతం రాబోయే వేసవి కాలంలో కొబ్బరి కాయ లోని కొబ్బరి నీళ్ళు వేసవి తాపాన్ని తగ్గించడానికి, మరీ ముఖ్యంగా చల్లదనాన్ని చేకూర్చడానికి కొబ్బరినీళ్లు ఎంతగానో సహాయపడతాయి.  అలాగే ఎండుకొబ్బరి కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మనలో చాలామంది ఎండుకొబ్బరి లో ట్యాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుందనే అపోహతో ఉంటారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు.
ఎండిన కొబ్బరి లో ఫైబర్,కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఎండు కొబ్బరి లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అంతేకాకుండా సగటు ఆరోగ్యవంతమైన పురుషునికి రోజుకు 38 గ్రాముల పీచు పదార్థం అవసరమైతే, మహిళలకు 25 గ్రాముల పీచు అవసరం. అయితే ఇదంతా ఎండు కొబ్బరి ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఎండు కొబ్బరిని చేర్చడం వల్ల అల్జీమర్స్ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఎండు కొబ్బరి లో సెలీనియం పుష్కళంగా లభించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ని పెంపొదిస్తుంది. అలాగే ఎండు కొబ్బరిలో ఖనిజాలు సమృద్దిగా లభించడం వల్ల పురుషులలో వచ్చే వంధ్యత్వ లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే సెలీనియం వంధ్యత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలు ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రోజు వీలైన పద్ధతిలో ఎండుకొబ్బరిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
ఎండు కొబ్బరి లో ఉండే అనేక పోషకాలు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడతాయి. అంతేకాకుండా పెద్దప్రేగు తోపాటు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని భయంకరమైన క్యాన్సర్లను దూరం చేసుకోవడానికి ఎండుకొబ్బరి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ సమస్య, మలబద్ధకం, అల్సర్ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: