కొన్ని వంటింటి చిట్కాలు మీకోసం.. వాటిని ఎలా వాడాలి...?
క్యాబేజీ కూర రుచిగా ఉండడానికి కూర వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేస్తే చాలా రుచిగా ఉంటుంది.
కూరలు వండేటప్పుడు నూనె వేడి అవ్వగానే అందులో కొద్దిగా పసుపు వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
పాత్రలపై జిడ్డు ఎక్కువగా పేరుకుపోయిన ప్పుడు ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో తోమి పాత న్యూస్ పేపర్లతో రుద్దితే జిడ్డు పోతుంది.
ఆకు కూరలు ఉడికించిన నీటిని పడేయకుండా ఆ నీటితో సూప్ తయారు చేసుకోవచ్చు.
వంట గదిలో చీమలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని నివారించడానికి చీమలు లో ఉన్న చోట నిమ్మరసం తినడం వల్ల అక్కడి నుండి వెళ్లిపోతాయి.
వెల్లుల్లి రెబ్బలను గంటసేపు నీళ్లలో నానబెట్టి పొట్టు తీస్తే సులువుగా వస్తుంది
పులిహోర కలపాలి అనుకున్నప్పుడు అన్నము ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి కానీ, వెన్న కాని వేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది.
పచ్చికొబ్బరి చిప్పలు తాజాగా ఉండాలంటే చిప్ప లోపల నిమ్మ రసం రాస్తే వారం వరకు తాజాగా ఉంటాయి.
టమాటాలు వండడానికి ముందు 10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెడితే రుచిగా ఉంటాయి.
క్యాలీఫ్లవర్ కూర చేసేటప్పుడు అందులో కాసిని పాలు కలిపితే కూర ఎంతో రుచిగా ఉంటుంది.
పుదీనా, కొత్తిమీర చట్నీ చేసే టప్పుడు అందులో నిమ్మరసం పిండి వల్ల రంగు మారకుండా ఉంటుంది.
పెసరపిండిలో నిమ్మరసం పిండి వెండి సామాగ్రి తోమడం వల్ల కొత్తవాటిలా మెరిసిపోతాయి.
ఉల్లిపాయ ముక్కలను వేయించేటప్పుడు అందులోకి చిటికెడు చక్కెర వేస్తే తొందరగా వేగుతాయి.