చర్మ రోగాలకు సహజసిద్ధమైన వాటితో నివారణ.. ఎలా..?
చర్మంపై తెల్ల బొల్లి మచ్చలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించడానికి మినుములను నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తెల్ల బొల్లి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల మచ్చలు తగ్గిపోతాయి.
గజ్జి, తామర వంటి చర్మ రోగాలను నివారించటానికి కిరసనాయిలు చాలా బాగా ఉపయోగపడుతుంది. కిరసనాయిల్ ను గజ్జి, తామర ఉన్నచోట రాయడం వల్ల అవి తగ్గుతాయి.
చర్మంపై శోభి మచ్చలు ఉన్నప్పుడు వాటి నివారణకు తులసి ఆకులను రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి శోబి మచ్చలపై రాసి ఆరిన తర్వాత స్నానం చేస్తే శోబి మచ్చలు మాయమవుతాయి.
స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు, రసం కలిపి స్నానం చేయడం వల్ల దురదలు, దద్దుర్లు వంటివి త్వరగా మానుతాయి.
చర్మము పై దద్దుర్లు, దురద, గజ్జి, తామర వంటివి ఉన్నప్పుడు తులసి ఆకులను మెత్తగా నూరి అందులోకి నిమ్మరసం పిండి చర్మంపై రావడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.
చర్మం పై తెల్ల మచ్చలు ఏర్పడినప్పుడు తెల్లగన్నేరు ఆకులను మెత్తగా నూరి మచ్చల మీద లేపనము చేయడంవల్ల మచ్చలు తొందరగా తగ్గిపోతాయి.
వామును నిప్పులపై వేసి ఆ పొగను చర్మానికి తగిలేటట్లు చేస్తే దద్దుర్లు, దురద వంటివి తొందరగా తగ్గుతాయి
ఉసిరిక పొడిని ఆరు గ్రాములు,పసుపు పొడి 3 గ్రాములు మంచినీటితో సేవిస్తుంటే రక్తం శుద్ధి అవడమే కాకుండా, చర్మం కూడా శుద్ధి అవుతుంది.