పసుపుతో సౌందర్యము.. ఎలా..?
పసుపు, చందనముఈ రెండింటినీ సమానంగా తీసుకొని పాల మీగడతో కలిపి స్నానానికి నిమిషాల ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి.తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.
పసుపు 2 గ్రాములు, ఉసిరిక పొడి రెండు గ్రాములు తీసుకొని కలిపి ఆ మిశ్రమాన్ని రోజు ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది.
పసుపు,వేప బెరడు చూర్ణం,కరక్కాయ చూర్ణం మూడింటిని సమానంగా తీసుకొని,అన్నింటినీ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రెండు గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల చర్మవ్యాధులు తగ్గడమే కాకుండా, క్రిమి రోగాలు కూడా తగ్గిపోతాయి.
పసుపు పొడి,వేపాకు చిగుళ్ళు,దిరిసెన పట్ట చూర్ణము మూడింటిని సమానంగా తీసుకొని పేస్టులా చేసుకొని ఆ పేస్ట్ ను దీర్ఘకాలికంగా ఉన్న వ్రణాలు మీద పట్టి వేయడం వల్ల వ్రణాలు తగ్గిపోవడమే కాకుండా,చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
పసుపులో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి సహాయ పడతాయి.
మరుగుతున్న నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. అంతేకాకుండా పసుపును ఆహార పదార్థాల్లో కొద్దిగా వాడితే రక్తం శుద్ధి అవుతుంది.
వేడి పాలలో కొంచం పసుపు కలిపి తాగడం వల్ల కఫం తగ్గుతుంది.అలాగే జామ ఆకులు, పసుపు కలిపి ముద్దగా నూరి ముఖానికి పట్టించుకోవడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.