వంకాయ: వీరు మాత్రం అస్సలు తినకండి?

Purushottham Vinay
వంకాయలని ఇష్టంగా తినే వారు మనలో  చాలా మంది ఉంటారు. వంకాయ  ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రతి సీజన్‌లో కూడా మనకు లభిస్తుంది. ఇక చలికాలంలో వంకాయ తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండగా అలాగే దీన్ని తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.వంకాయ తినడం వల్ల గుండె జబ్బులు ఇంకా అలాగే బ్లడ్ షుగర్ జబ్బులు అదుపులో ఉంటాయి. వంకాయ తింటే బరువు కూడా చాలా ఈజీగా తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొంతమంది మాత్రం వంకాయలు అసలు తినకూడదు.మీరు పైల్స్‌ సమస్యతో బాధపడుతున్నట్లయితే వంకాయలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. లేదంటే మీ సమస్య కాలక్రమేణా పెరుగుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్‌తో ఇబ్బందులు పడుతున్నట్లయితే వంకాయకు చాలా దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వంకాయలో ఉండే ఆక్సలేట్ రాళ్ల సమస్యను బాగా పెంచుతుంది.ఇంకా అలాగే మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే పొరపాటున కూడా వంకాయ తినకండి.


ఎందుకంటే మీ శరీరంలో రక్తం శాతం పెరగడం చాలా కష్టతరం అవుతుంది.ఇంకా కళ్లలో మంట లేదా వాపు వంటి సమస్యలు ఉన్నవారు కూడా వీటికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే అది సమస్యను బాగా పెంచవచ్చు.అలాగే గ్యాస్, పొట్ట సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయలను తినకూడదు.ఇంకా కడుపు సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తినకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండటం వారి ఆరోగ్యానికి మంచిది.ఇంకా అలాగే ఒక వ్యక్తికి ఏదైనా రకమైన చర్మ అలెర్జీ ఉన్నట్లయితే వారు కూడా వంకాయలకు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి.ఎందుకంటే ఈ వంకాయ తినడం వల్ల మీకు అలర్జీ వస్తుంది.అలాగే డిప్రెషన్ కోసం ఔషధం తీసుకుంటుంటే లేదా ఏదైనా రకమైన డిప్రెషన్‌ సమస్యతో బాధపడుతుంటే వంకాయను తినడం ఖచ్చితంగా మానేయాలి. ఎందుకంటే వంకాయ కూరను తినడం వల్ల మెడిసిన్‌ ప్రభావం కూడా ఈజీగా తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: