గుండెపోటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వేసుకోండి?

Purushottham Vinay
ఈ రోజుల్లో తక్కువ వయసున్న వారికి కూడా గుండెపోటు వచ్చేస్తోంది. అంతకముందు మామూలుగా 45 ఏళ్లు వయస్సు పైబడిన మగవారికి, 55 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లకు మాత్రమే గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఇప్పుడు చాలా చిన్న వయస్సులోనే ఈ సమస్య వస్తుంది. ఇక మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువని వైద్యులు చెబుతుంటారు. అలాగే మన కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఎవరికైనా ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది.గుండె పోటు వచ్చే ముందు సంకేతాలలో చాతిలో నొప్పి ఒకటి. ఇంకా ఈ నొప్పి వచ్చే సమయంలో ఎడమ చేయి లేదా కుడి చేయి లాగడం, మొండెం ఇంకా చాతి దవడ నొప్పితో కుడి వైపు ఎక్కువగా లాగడం వంటివి ఉంటాయి.ఇక ఈ నొప్పి 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు కనుక ఉంటే వెంటనే  వైద్యులను సంప్రదించాలి.ఈ సమయంలో బరువు, బిగుతు, ఒత్తిడి, నొప్పి, మంట లేదా తిమ్మిరిని మీరు అనుభూతి చెందవచ్చు.


ఇంకా అలాగే అలసట, ఆందోళన, స్పీడ్ హార్ట్ బీట్ ను కూడా మనం అనుభించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ సంకేతాలు కనిపించిన వెంటనే భయపడకుండా  ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సాయం పొందాలి. అప్పుడు సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్ ను తీసుకొని నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా మీకు నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా భావించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ) ఇంకా అలాగే అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తరువాత ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి.అయితే అత్యవసర సమయంలో మాత్రమే వీటిని వేసుకుంటారు కాబట్టి ఈ టాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అంతగా ఉండవు. కానీ ఈ టాబ్లెట్ కోనేముందు ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదించి వారి సలహా మేరకు వాడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: