మలబద్దకం సమస్య తగ్గాలంటే..?

Purushottham Vinay
చాలా మందికి కూడా మలబద్దకం సమస్య ఉంటుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నీటిని తక్కువగా తాగడం, తగినంత శారీరక వ్యాయామం చేయకపోవడం ఇంకా అలాగే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటి చాలా రకాల వల్ల ఈ మలబద్దకం సమస్య తలెత్తుతుంది. అయితే ఈ సమస్యని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మన శరీరంలో వచ్చే సగం అనారోగ్య సమస్యలకు ఇదే ప్రధాన కారణమవుతుంది. మలబద్దకం సమస్య కారణంగా గ్యాస్, పుల్లటి త్రేన్పులు, కడుపు నొప్పి, చికాకు, ఆకలి లేకపోవడం ఇంకా నిరుత్సాహంగా ఉండడం వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా ఈ సమస్య నుండి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజూ యోగా, వాకింగ్, జాజింగ్, రన్నింగ్ వంటి పనులు చేయాలి.ఖచ్చితంగా చక్కటి జీవన విధానాన్ని అవలంబించాలి. అలాగే ప్రతిరోజూ ప్రాణాయామం ఇంకా కఫాలభాతి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పొట్ట బాగా కదులుతుంది. దీంతో మలబద్దకం సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అదే విధంగా అజీర్ణం చేసే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు.ముఖ్యంగా హడావిడిగా ఎప్పుడూ  భోజనం చేయకూడదు.


ఎప్పుడు కింద కూర్చోని నెమ్మదిగా బాగా నములుతూ భోజనం చేయాలి. మీకు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారాలను కూడా ఎప్పుడు బాగా ఉడికించాలి.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి.ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగాలి. అయితే భోజనం చేసేటప్పుడు మాత్రం నీరు తాగకూడదు. భోజనం చేసిన 40 నిమిషాల తరువాత అలాగే భోజనానికి అరగంట ముందు మాత్రమే నీరు తాగాలి. అలాగే ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.జంక్ ఫుడ్ ను ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినకూడదు. ఈ టిప్స్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. మలబద్దకం సమస్యను తగ్గించుకోవడం వల్ల మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాము. మలబద్దకం సమస్య తగ్గడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: