"జలుబు - దగ్గు" ఎక్కువ రోజులు తగ్గడం లేదా ?

VAMSI
ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది.. దట్టమైన మంచుతో తెలుగు రాష్ట్రాలు ప్రజలను ఎముకలు కొరికే చలితో భయాందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ చలి ప్రభావం వలన కొందరికి చిన్న పాటి జలుబు, దగ్గు మరియు జ్వరం రావడం సహాజమే . మాములుగా జలుబు మరియు దగ్గు తరచూ రావడం రెండు మూడు రోజుల పాటు ఇబ్బంది పెట్టి తగ్గిపోతో ఉంటాయి. మందులు వాడినా వాడకపోయినా జరిగేది ఇదే. అయితే ఇపుడు మనము చెప్పుకున్న విధంగా కాకుండా జలుబు మరియు దగ్గు కనుక రోజులు తరబడి మనల్ని వీడి వెళ్లకపోతే మాత్రం జర ఆలోచించాల్సిన విషయమే. మీకు కానీ లేదా మీ కుటుంబం లోని వారికి కానీ జలుబు మరియు దగ్గు 20 రోజుల పాటు తగ్గకుండా వస్తూ పోతూ ఉంటే... అదేమీ కరోనా అయ్యే అవకాశం లేదు .
చాలా మంది ఈ విషయం గురించి ఆందోళన చెందుతున్నారు.. ఈ మహమ్మారి కరోనా జలుబు దగ్గుతోనే కదా మొదలయ్యేది. అయితే మరికొన్ని రోజుల్లో ఎవరికి అయినా ఈ సమస్య ఉంటే బాధపడవలసిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ఈ రకమైన జలుబు దగ్గు రావడానికి రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఒకటి .. ఎలర్జీలు మరియు శక్తివంతమైన బ్యాక్తీరియాలు .
వాతావరణంలో త్వరిత గత మార్పుల కారణంగా ఈ ఎలెర్జీలు వస్తున్నట్లు డాక్టర్స్ భావిస్తున్నారు. మాములు జలుబుతో అయితే తుమ్మడం నెమ్మదిగా వస్తుంది. అదే అలర్జీ వలన వచ్చిన జలుబుతో తుమ్ములు విపరీతంగా వస్తాయని నిర్ధారించారు. ఈ ఎలర్జీకి ఎటువంటి మందు లేదు అని వీరు తెలుపుతున్నారు. పైన తెలిపిన విధంగా లక్షణం కనుక ఉన్నట్లయితే ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఇంకో వారం రోజుల్లో వాతాహవరణంలో మార్పులు తొలగి పోయి అంతా సాదారణముగా అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: