అవిసె గింజల్ని అధికంగా వాడుతున్నారా..అంతే సంగతులు..!!

Divya
సాధారణంగా అవిసె గింజలు ఆరోగ్యానికి మరియు అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల,మంచి ప్రభావాలను చూపిస్తాయి కానీ,అవిసె గింజల్ని మొతాదుకు మించి తీసుకోవడం వల్ల చాలా దుష్ప్రభావాలను కలిగిస్తాయి.
ఏదైనా అంతే కదా అతి అనర్థం అంటారు. వీటిని అధికంగా తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..
జీర్ణ సమస్యలు..
ప్రతి మనిషి  రోజుకి 50గ్రామ్స్ వరకు అవిసె గింజలు తీసుకోవచ్చు.అంతకు మించి తీసుకోవడం వల్ల,కడుపులోని ప్రేగులను నులిపెట్టినట్లు కడుపు నొప్పి వస్తుంది.అంతేకాక క్రమంగా మలబద్ధకం లేదా  అతిసారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
పీచు పదార్థాలను సంగ్రహించుకోకపోవడం..
మీరు అవిసె గింజల్ని ఆహారంతోపాటు తీసుకుంటున్నప్పుడు అందులోని పీచు పదార్థము శోషించుకోవడానికి అధిక నీరు తాగడం చాలా అవసరం.పచ్చి అవిసెగింజలు లేదా బాగా పండని అవిసెగింజలు తినడం వల్ల గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్..
అవిసె గింజలు అధికంగా తీసుకోవడం వల్ల స్త్రీలలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ లెవెల్స్ పెంచి, అధిక ఋతుస్త్రావం జరిగేలా చేస్తుంది. మరియు లైంగిక శక్తిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి.స్త్రీ గర్భధారణ సమయంలో లేదా బిడ్డకు-తల్లి చనుపాలను పట్టే సమయంలో అవిసె గింజలను అధికంగా తీసుకోకపోవడం చాలా మంచిది.
మధుమేహం వ్యాధిగ్రస్తులకు..
మధుమేహం వంటి ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే అవిసె గింజలు తీసుకోకపోవడం చాలా మంచిది. అలా. తీసుకోవాలి అన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు అవిసె గింజలను తీసుకోవడం ఉత్తమం.డయాబెటిస్ తో బాధపడేవారు అవిసె గింజలు అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను హెచ్చు తగ్గులు అయ్యో అవకాశాలు ఉంటాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు..
సాధారణంగా అవిసె గింజలు మొతాదులో తీసుకోవడం వల్ల రక్తసరఫరాను సక్రమంగా జరిగేలా చేస్తాయి.కానీ అంతకుమించి తీసుకోవడం వల్ల రక్త సరఫరా అధికంగా జరిగి,సిస్టోలీక్ ప్రెజర్ పెరిగి,గుండె పనితీరును దెబ్బ తీస్తాయి. కావున వైద్యుని సలహా మేరకు అవిసె గింజలు వాడటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: