టీ బ్యాగులను.. కనుక్కున్నది ఈయనేనట తెలుసా?

praveen
కాలంతో పాటే మనుషులు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి అని అందరూ అంటూ ఉంటారు. అయితే ఎన్ని కాలాలు మారినా మనిషి మార్చుకొని ఒకే ఒక అలవాటు ఏదైనా ఉంది అంటే అది టీ తాగడమే. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి టీ తోనే ప్రారంభమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఉదయం లేచిన తర్వాత టీ లేకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. అంతలా నేటి రోజుల్లో మనుషులు టీ కి బానిసలుగా మారిపోయారు అని చెప్పాలి.

 కానీ ఇలా బానిసలు అనుకోకుండా ప్రస్తుతం టీ ప్రియులు అని ఎంతో మంది  పెట్టుకున్న పేరు.  అయితే టీ కావాలి అంటే ఒకప్పుడు పెద్ద ప్రాసెస్ ఉండేది. నీళ్లు మరగపెట్టి అందులో టీ పొడి పాలు వేసి తర్వాత చక్కెర వేసుకొని వడగట్టుకుని తాగాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం టీ బ్యాగ్ అందుబాటులోకి వచ్చిన కారణంగా టీ తయారు చేసుకోవడం మరింత సులభతరంగా మారిపోయింది అని చెప్పాలి. కేవలం రెండే రెండు నిమిషాల్లో టీ రెడీ అయిపోతుంది. ఇటీవలే కాలంలో టీ బ్యాగులు ఎంత ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు టీ బ్యాగులు వాడుతున్నారు. కానీ ఇక టీ బ్యాగులను ఎవరు కనుగొన్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. 1900 సంవత్సరంలోనేఈ టీ బ్యాగులను కనుగొన్నారుట. థామస్ సుల్లివన్ అనే వ్యక్తి ఒక టీవీ వ్యాపారి కొడుకు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నాడట ఆయన. టీ తయారీలో ఖర్చును తగ్గించడానికి కొంచెం టీ పొడిని చిన్న పట్టు పౌచీలో వేసి ప్యాక్ చేసి వినియోగదారులకు పంపించాడు. అయితే మొదట్లో ఇక టీ బ్యాగులను ఎలా వినియోగించుకోవాలో కస్టమర్లకు అర్థమయ్యేది కాదు. కానీ ఆ తర్వాత వేడి నీటిలో  టీ బ్యాగులను ముంచడం రెండు నిమిషాల్లో టీ తయారు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఆ టి బ్యాగులకు మరింత ఆదరణ పెరిగిపోయింది. ఇటీవల కాలానికి అనుగుణంగానే  ఎన్నో మార్పులు రాగా ప్రస్తుతం పలుచని కాగితాన్ని టీ బ్యాగులకు ఉపయోగిస్తున్నారు. ఇక ఇప్పుడు టీ బ్యాగులకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tea

సంబంధిత వార్తలు: