పొద్దున్నే ఈ టీ తాగితే మీ ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్?

Purushottham Vinay
మనకు టీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అయితే దాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకోని తాగడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది.ఇక వాములో చాలా రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, థయామిన్,రైబోఫ్లావిన్ ఇంకా అలాగే నియాసిన్ వంటి పోషకాలు వాములో పుష్కలంగా ఉంటాయి.ఇంకా అలాగే ఫాస్పరస్, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా వాములో చాలా పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇన్ని ఔషధాలున్న వామును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వాముతో టీని తయారు చేసుకోని తాగడం వల్ల అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో వాము టీ తాగడం వల్ల చాలా వ్యాధుల నుంచి వచ్చే ప్రమాదాన్ని ఈజీగా దూరం చేసుకోవచ్చు.


ఇక వాము టీని ఎలా తయారు చేసుకోవాలంటే..ఈ వాము టీ చేయడానికి.. కొంచెం వామును తీసుకుని దానిని నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ తరువాత దానిని ఫిల్టర్ చేసి.. ఆ నీటిలో కొంచెం తేనె కలుపుకుంటే వాము టీ రెడీ అయిపోయినట్టే.వాములో ఉండే గుణాలు ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతగానో మేలు చేస్తాయి. వాము టీ నిద్రలేమి సమస్యను కూడా చాలా ఈజీగా దూరం చేస్తుంది. ఇది ఆందోళన ఇంకా అలాగే డిప్రెషన్ వంటి సమస్యలను కూడా ఈజీగా దూరం చేస్తుంది. వాము టీ తాగడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది.ఇక ఈ టీ తాగడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారతాయి. కీళ్ళు లేదా ఎముకలలో నొప్పి ఉన్నవారికి వాము టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.వాములో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ టీ రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. వాము టీ తాగడం వల్ల జలుబు ఇంకా అలాగే ఫ్లూ వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: