అధిక పైబర్ పొందాలి అంటే.. ఇలాంటి ఆహారాలు తీసుకోవాల్సిందే..!

Divya
మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే అధిక పైబర్ చాలా అవసరం.మనం తీసుకున్న ఆహారంలోని పైబర్, మనం తిన్న ప్రతి ఆహార పదార్థాన్ని శుభ్రంగా జీర్ణం చేస్తుంది.తగిన పైబర్ కంటెంట్ తీసుకోకపోతే ఆజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు చుట్టూ ముడతాయి. ఇలాంటి రోగాలు ముదిరి కిడ్నీ సమస్యలకు దారి తీస్తాయి. కావున ప్రతి ఒక్కరూ పైబర్ కంటెంట్ వున్న ఆహారాలు తీసుకోవాలి. అధిక పైబర్ వున్న ఆహారలెంటో ఇప్పుడు చూద్దాం..

Vegetable సలాడ్స్..
ఉదయాన్నే టిఫిన్స్ బదులుగా వెజిటేబుల్ సలాడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి కూరగాయలు తినడం వల్ల మన శరీరానికి అధిక పైబర్ అంది, తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది.మరియు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా  చేస్తుంది. దీనితో చెడు కొలెస్ట్రాల్ కరిగి, అధిక బరువు ఈజీగా తగ్గుతారు.
మొలకేత్తిన గింజలు..
మొలకెత్తిన పెసలు, అలసందలు, శనగలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అధికఫైబర్ అందుతుంది. వారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణం అవ్వడానికి దోహదపడతాయి.
బీట్ రూట్ జ్యూస్..
దీనికోసం ఒక చిన్నసైజు బిట్ రూట్ తీసుకొని, ముక్కలుగా కట్ చేసి, అందులో కొంచెం కొత్తిమీర, రెండు టేబుల్ స్ఫూన్ ల తేనే, రెండు టేబుల్ స్ఫూన్ ల నిమ్మరసం కలిపి, మీక్సీ జార్ లో వేసి, బాగా మీక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి,ఆ జ్యూస్ ను టిఫిన్ తిన్న గంట తర్వాత తీసుకోవడం ఉత్తమం. ఇది అధిక పైబర్ ను ఇవ్వడమే కాక, రక్తహీనతను తగ్గిస్తుంది. మరియు ముఖసౌందర్యాన్ని పెంచుతుంది.
చియాసీడ్స్..
ఇందులో శరీరానికి కావాల్సిన పైబర్, ప్రోటీన్, క్యాల్షియం   అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్ఫూన్ చియాసీడ్స్ తీసుకొని, రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే దీనికి ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు, ఒక చెక్క నిమ్మరసం, ఒక స్ఫూన్ తేనే కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: