చలికాలం ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Purushottham Vinay
చలికాలంలో ఏ జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఫ్రిజ్ లో వుండే ఐటమ్స్ అస్సలు తినకూడదు. కేవలం వేడిగా ఉండే ఆహారాలను మాత్రమే తినాలి. ఇంకా చలికాలంలో మద్యం సేవించడంతోపాటు టీ, కాఫీలను అధికంగా తాగుతారు కొందరు. ఇలా అస్సలు చెయ్యకూడదు. ఇలా చేస్తే చాలా తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయి. వీటికి బదులుగా కషాయాలు ఇంకా అలాగే హెర్బల్ టీ లను తాగవచ్చు. దీంతో మీ శరీరం ఎప్పుడూ కూడా వెచ్చగా ఉంటుంది. ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల చలికాలంలో వెచ్చగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి.ఇంకా ఈ కాలంలో సాయంత్రం నుంచి వీలైనంత వరకు మనం ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయాలి. బయటకు అస్సలు రానే రాకూడదు. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప అస్సలు బయటకు వెళ్లకూడదు. ఇంకా అలాగే ఇంటి లోపలి ప్రదేశాలు కూడా ఎప్పుడు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులను ఖచ్చితంగా మూసేయాలి. అలాగే రూమ్ హీటర్లను వాడటం వల్ల కూడా వెచ్చగా ఉండవచ్చు. ఇక చలికాలంలో మనకు పెద్దగా దాహం అనిపించదు. కానీ తప్పనిసరిగా రోజుకు తగిన నీళ్లను తాగాలి.


దీని వల్ల శరీరానికి కావల్సిన ద్రవాలు చాలా ఈజీగా అందుతాయి. దీంతో శరీరం చాలా వెచ్చగా ఉంటుంది. జీవక్రియలు కూడా సరిగ్గా ఉంటాయి.ఇంకా మనం ధరించే దుస్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి. పలుచని దుస్తులను వేస్తే ఖచ్చితంగా రెండేసి చొప్పున ధరించాలి. అలాగే ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు, మంకీ క్యాప్స్, స్కార్ప్‌లు, చేతులకు గ్లోవ్స్‌ ఇంకా కాళ్లకు సాక్స్ వంటివి ఖచ్చితంగా ధరించాలి.ఎందుకంటే ఇవి మనల్ని వెచ్చగా ఉంచుతాయి. చలి బారి నుంచి చర్మాన్ని మనల్ని ఈజీగా సంరక్షిస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో మనం ధరించే దుస్తుల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఇక దీంతోపాటు శరీరాన్ని కూడా ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. పొడిగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. ఇంకా తడి ఎక్కువ సేపు ఉండకూడదు. దుస్తులు తడిగా ఉంటే మనం చాలా తీవ్రమైన చలిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శరీరం తడిగా ఉన్నా కూడా ఎక్కువ చలిగా అనిపిస్తుంది. అందుకే శరీరం పొడిగా ఉండడంతోపాటు దుస్తులు కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: