చలికాలం ఇవి తీసుకుంటే ఏ రోగం దరిచేరదు?

Purushottham Vinay
చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, ఊపిరిత్తితుల సమస్యలతో అందరూ ఎంతగానో బాధపడుతుంటారు. ఇక ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఖచ్చితంగా తగిన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఇన్ ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఈ చలికాలంలో అల్లం, బెల్లం, పసుపు, అశ్వగంధ లాంటి పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియ సహాయం చేస్తుంది. ఇంకా గ్రాస్ట్రిక్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే బెల్లంలో ఐరన్, విటమిన్ – సి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా జలుబు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లతో బెల్లం చాలా శక్తివంతంగా పోరాడుతుంది.కాబట్టి చలికాలంలో మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా బెల్లం ఉండేలా చూసుకోవాలి.ఇంకా అల్లంలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలం తీసుకునే ఆహారంలో కచ్చితంగా అల్లాన్ని చేర్చుకుంటే మంచిది.


ఎందుకంటే చలిని తట్టుకోడానికి అల్లం టీ తాగితే మంచి ఫలితాలు ఉండడమే కాక జలుబు సమస్య నుంచి కూడా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా అలాగే పలు అలర్జీల నుంచి కూడా అల్లం రక్షిస్తుంది.ఇంకా పసుపులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి పసుపు  శ్లేష్మం ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది. ఇంకా అలాగే ఇది సహజంగా శ్వాసకోశాన్ని అడ్డుకునే సూక్ష్మజీవులను కూడా బయటకు పంపుతుంది. పసుపులోని యాంటీవైరల్ ఇంకా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి బాగా ఉపయోగపడతాయి.ఇంకా అలాగే దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడతాయి.కుంకుమపువ్వు శీతాకాలంలో ఒక గొప్ప ఆహారమనే చెప్పాలి. ఎందుకంటే ఇది మీకు వెచ్చదనాన్ని కలిగించడమే కాకుండా జలుబు ఇంకా దగ్గు లక్షణాలను కూడా చాలా ఈజీగా నయం చేస్తుంది. ఇంకా అలాగే వెచ్చని కప్పు పాలల్లో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: