కాల్షియం లోపం గుర్తించడం ఎలా..?

Divya
మన శరీరంలో ఉండే అత్యంత సమృద్ధికరమైన ఖనిజం కాల్షియం.ఇది మన శరీరంలో ఉండే అన్ని అవయవాలకి చాలా అవసరం. ముఖ్యంగా ఎముకలు, గోళ్లు ధ్రుడంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కాల్షియం మనకి పాలు, జున్ను, పెరుగు,ఎగ్స్, పన్నీరు, గోంగూర, క్యాబేజి, బచ్చలికూర మరియు అన్ని ఆకుపచ్చ ఆకులలోనూ, తాజా నారింజపండ్లలోను , తృణ ధాన్యాలలోనూ, సోయా, బాదాంపాలలోనూ సమృద్ధిగా దొరకుతుంది.
మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి ప్రధాన కారణం కాల్షియం.
శరీరంలో సమపాలనలో కాల్షియం లేకపోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువకాలం శరీరంలో కాల్షియం లోపిస్తే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ కాల్షియం లోపం వల్ల పెద్దప్రేగు కణితులకు దారి తీస్తుంది.
 కాల్షియం లోపం వల్ల గుండె జబ్బులు వస్తాయి. శరీరంలో కాల్షియం లోపించడం వల్ల మీరు అధిక రక్తపోటుకు గురవుతారు. అధిక రక్తపోటు స్ట్రోక్ కు కారణం అవ్వచ్చు.
శరీరంలో క్యాల్షియం లోపిస్తే గోళ్లు బలహీనంగా మారి పగులుతాయి.  ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కాల్షియం లోపం ఉన్నట్లు గుర్తించాలి.
కాల్షియం సరిగా లేకపోతే మన దంతాలు పటిత్వాన్ని కోల్పోతాయి. దంతాలు పుచ్చు పట్టడం, విరిగి  పోవడం  లాంటి లక్షణాలు కన్పిస్తాయి.
కాల్షియం సరిగ్గా అందకపోవడం వల్ల విటమిన్ D లోపం కూడా వస్తుంది. విటమిన్ D లోపం వస్తే మన శరీరంలో  వుండే బ్లాక్ సెల్స్ తగ్గిపోతాయి. ఇలా తగ్గడం వలన మన చర్మం  బొల్లి గా మారే అవకాశం ఉంది.
మన శరీరం లో ఉండే కాల్షియం  మెలటోనిన్  అనే హార్మోన్ ని విడుదల చేసేందుకు ఉపయోగపడుతుంది. మెలటోనిన్ వల్ల మనకి నిద్ర బాగా పడుతుంది. కాల్షియం సరిగా లేకపోతే మనకి మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల అవ్వకపోతే మనకి నిద్ర సరిగా పట్టదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: