చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే?

Purushottham Vinay
చలికాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ జబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.చలి ఎక్కువగా ఉండటం వల్ల రోజు చేసే ఎక్సర్‌సైజ్‌లను కూడా వాయిదా వేస్తుంటారు.వాతావరణంలో వచ్చే మార్పుల్ని తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా బలంగా ఉండాలి. లేదంటే జలుబు, దగ్గు ఇంకా అలాగే ఆస్తమాతో పాటు పలు చర్మ సంబంధిత సమస్యలు కూడా ఈజీగా తలెత్తుతుంటాయి.ఇక వీటికి తోడు ప్రస్తుతం కరోనా వైరస్‌ కూడా మళ్ళీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధక శక్తి అనేది సరిగ్గా లేకపోతే చలికాలంలో ఆరోగ్యం పైనా అవి చాలా ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.ప్రస్తుత కాలంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.మనం తీసుకునే ఆహారం ఖచ్చితంగా చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే మంచి పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవడం ఈ కాలంలో చాలా అవసరం.


అలాగే ఈ కాలంలో చాలా మందికి కూడా పెద్ద దాహంగా అనిపించదు. దీంతో ఎప్పుడోగానీ వాళ్ళు నీళ్లు తాగరు.అయితే అలాకాకుండా.. ప్రతి రోజు కూడా నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. ఇంకా అలాగే వీలైనన్ని ఎక్కువసార్లు మూత్ర విసర్జణ అనేది చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు ఎప్పటికప్పుడు సులభంగా బయటికి వెళ్లిపోయి రోగనిరోధక శక్తి అనేది క్రమంగా బలపడుతుంది. ఇంకా అలాగే రెండుసార్లు మలవిసర్జన చేయడం కూడా చాలా మంచిదే. దీనివల్ల జీర్ణాశయ పేగులు బాగా శుభ్రమవుతాయి. ఇంకా ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా అది వేడిగా ఉన్నప్పుడు తినాలి. రాత్రిళ్లు 7 గంటలలోపే ఆహారం తినడం వల్ల చాలా త్వరగా జీర్ణం అవుతుంది. ఆకు కూరలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, కూరగాయలు ఇంకా ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల వల్ల రోగ నిరోధక శక్తి చాలా బలంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: